జాదవ్‌ కుటుంబాన్ని మానసికంగా హింసించిన పాక్.. జాదవ్‌ భార్య బొట్టు, మంగళసూత్రం తీయించిన పాక్ అధికారులు

Submitted by arun on Wed, 12/27/2017 - 10:31
Kulbhushan Jadhav's meeting

పాక్ వక్రబుద్దిని మార్చుకోవడం లేదు. కుల్‌భూషణ్ జాదవ్‌ను ఎక్కడో అరెస్ట్ చేసి పాకిస్తాన్‌లో అరెస్ట్ చేసినట్లు నాటకానికి తెరతీసింది. నాటకాలను అక్కడితో ఆపలేదు. జాదవ్‌ను జైలులో అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేసింది. మరణశిక్ష విధించిన పాక్ ఐక్యరాజ్యసమితి ఒత్తిడితో మరణశిక్షను వాయిదా వేసింది. తాజాగా జాదవ్‌ను చూసేందుకు అనుమతించిన పాకిస్తాన్‌ ఇస్లామాబాద్‌ వెళ్లిన తర్వాత తల్లి, భార్యను కలిసే అవకాశం లేకుండా అద్దాలతో అడ్డుగోడ కట్టింది. జాదవ్‌ ఉన్న రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఫోన్‌ ఎత్తి మాట్లాడే అవకాశం లేకుండా దుర్మార్గం వ్యవహరించింది.

కుల్‌భూషణ్‌ జాదవ్‌తో భేటీలోనూ నానా రకాలుగా తల్లి, భార్యను వేధింపులకూ గురిచేసింది. భార్య చేతన్‌కుల్‌, తల్లి అవంతి లను ఇస్లామాబాద్‌లో ఓ పాత షిప్పింగ్‌ కంటైనర్‌ వెనుక భాగానికి తీసికెళ్ళారు. చిన్న గదిలో ఓ వైపు చేతన్‌కుల్,అవతిలను అద్దాలకు అవతలవైపు కుల్‌భూషణ్‌ నిల్చోబెట్టి మాట్లాడుకోమన్నారు. మాటలకు ముందు భార్య చేతనను కుంకుమ బొట్టు చెరిపేయమన్నారు. మంగళసూత్రాన్ని, గాజులను తీసేయమన్నారు. వారిద్దర్నీ కట్టుకున్న బట్టలు మార్చేసి వేరేవి కట్టుకోమన్నారు. ఓ విధవరాలిలా కనిపించాలని ఆదేశించారు. తల్లి అవంతిని కూడా బొట్టు తీసేయమన్నారు. 

అవంతి తన కొడుకుతో మరాఠీలో మాట్లాడబోతే అడ్డుకుని హిందీలోనో, ఇంగ్లీషులోనో మాట్లాడాలని షరతు పెట్టారు. ఇద్దరి మధ్యా ఓ చిన్న ఇంటర్‌కమ్‌ పెట్టి,  ప్రతీ మాటకు ముందూ ఓ అధికారి స్విచాఫ్‌ చేసి ఇపుడేం మాట్లాడేవో చెప్పమంటూ ప్రశ్నించారు. 40 నిముషాల పాటు పాకిస్తాన్ అధికారులు దర్బుద్దితో వ్యవహరించారు. అడుగడుగునా వేధింపులే నీ కొడుకును నీకు చూపించడమే ఎక్కువంటూ అసహ్యించుకున్నారు. ములాఖత్ అయిపోయాక చాలాసేపు కార్లో కూర్చోబెట్టారు. చివర్లో జాదవ్ తల్లి, భార్య చెప్పులు కూడా తిరిగి ఇవ్వలేదు. మధుమేహం ఉందని, కనీసం తన బూట్లు ఇవ్వమని అవంతి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. ఈ సమావేశానికి అనుమతినిచ్చినందుకు తాను పాక్‌ సర్కార్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానని కుల్‌భూషణ్‌ అన్నట్లుగా ఉన్న ఓ వీడియోను పాక్‌ ప్రసార సాధనాలు పదే పదే ప్రసారం చేశాయి.

తన కుమారుడి ఎడమ చెవి దగ్గర, బుగ్గమీద గాట్లున్నాయని, మనిషి డల్‌గా కనిపించాడంటూ స్వదేశానికి వచ్చిన తర్వాత అవంతి విదేశాంగ మంత్రులకు తెలియజేశారు. తమ ఇద్దరినీ చూశాక అతనిలో ఉత్సాహం రావాలని, ఏదో శూన్యంలో చూస్తున్నట్లుగా కనిపించాడంటూ వివరించారు. దీంతో విదేశాంగ శాఖ పాకిస్తాన్‌ సీరియస్ అయింది.  పాక్‌ అతిగా టాంటాం చేసుకున్న మానవత్వం ఇదేనా? వారి సంస్కృతీ సంప్రదాయాలను ఇంత దారుణంగా అవమానిస్తారా? ఆ ఇద్దరు మహిళలను అడుగడుగునా అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
 

English Title
Pakistan Defends Confiscating Shoes Worn by Kulbhushan Jadhav's Wife

MORE FROM AUTHOR

RELATED ARTICLES