మ‌ళ్లీ దీపావ‌ళే టార్గెట్‌?

మ‌ళ్లీ దీపావ‌ళే టార్గెట్‌?
x
Highlights

ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌..సందేశాన్ని జోడించి యాక్ష‌న్‌ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో త‌న‌దైన ముద్ర వేసిన త‌మిళ ద‌ర్శ‌కుడు పేరిది. 'గ‌జిని', 'స్టాలిన్‌',...

ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌..సందేశాన్ని జోడించి యాక్ష‌న్‌ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో త‌న‌దైన ముద్ర వేసిన త‌మిళ ద‌ర్శ‌కుడు పేరిది. 'గ‌జిని', 'స్టాలిన్‌', 'తుపాకి' వంటి చిత్రాల‌తో తెలుగువారికి చేరువైన ఈ ద‌ర్శ‌కుడు ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబుతో తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో 'స్పైడ‌ర్‌'ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ద‌స‌రా కానుక‌గా ఈ నెల 27న ఈ సినిమా విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌తో చేయ‌నున్నాడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన 'తుపాకి', 'క‌త్తి' చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి. జ‌న‌వ‌రి నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న వీరి ఈ హ్యాట్రిక్ ప్ర‌య‌త్నం వ‌చ్చే ఏడాది దీపావ‌ళికి విడుద‌ల కానుంద‌ని స‌మాచారం. విశేష‌మేమిటంటే.. 'తుపాకి', 'క‌త్తి' చిత్రాలు కూడా దీపావ‌ళికే ప్రేక్ష‌కుల ముందుకి వ‌చ్చాయి. ముచ్చ‌ట‌గా మూడోసారి కూడా దీపావ‌ళికే రానున్న ఈ కాంబినేష‌న్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories