పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు భారీ షాక్

Submitted by arun on Fri, 04/13/2018 - 14:22
Nawaz Sharif

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు భారీ షాక్ తగిలింది. పనామా పేపర్స్ లీక్ కేసులో.. ప్రధాని పదవి నుంచి తప్పుకున్న నవాజ్ షరీఫ్‌.. ఇక భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా.. జీవితకాలం నిషేధం విధించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 62, వన్‌ ఎఫ్‌  ప్రకారం.. జీవితకాలం పాటూ నిషేధిస్తున్నట్లు అక్కడి సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో భాగంగా ఈ నిషేధం సరైనదేనని.. తీర్పు సందర్భంగా ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. షరీఫ్‌తోపాటు పాకిస్థానీ తెహ్రీకె ఇన్సాఫ్ ప్రధాన కార్యదర్శి జహంగీర్ తరీన్‌పై కూడా జీవితకాల నిషేధం విధించారు. ఇది పాక్ రాజకీయ వ్యవస్థపై పెద్ద ఎత్తున ప్రభావం చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 


 

English Title
Nawaz Sharif Stands Disqualified from Public Office for Life, Says Pakistan SC in Historic Verdict

MORE FROM AUTHOR

RELATED ARTICLES