ఐ ల‌వ్ పాకిస్థాన్

ఐ ల‌వ్ పాకిస్థాన్
x
Highlights

కేంద్ర మాజీ మంత్రి మణి శంకర్ అయ్యర్ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో పీఎం మోడీ నీచ జాతికి చెందిన వ్యక్తి...

కేంద్ర మాజీ మంత్రి మణి శంకర్ అయ్యర్ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో పీఎం మోడీ నీచ జాతికి చెందిన వ్యక్తి అంటూ కామెంట్స్ చేశారు. మణిశంకర్ అయ్యర్ చేసిన ఈ కామెంట్లతో ఒక్కసారిగా గుజరాత్‌ క్యాంపెనింగ్‌ తీరునే మార్చేశారు నరేంద్ర మోదీ. ఈ కామెంట్లతో గుజరాతీ సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేశారు. తాను అచ్చమైన గుజరాతీనని, అయ్యర్ కామెంట్లు రాష్ట్ర ప్రజలందరిపైనా చేసినవని, బీసీని అయినందుకే ఇలాంటి నీచ్ వ్యాఖ్యలు చేశారని కులం కార్డుతో కుమ్మేశారు. ఈ కామెంట్‌ను మోదీ ఎంత శక్తివంతంగా ప్రయోగించారంటే, ఈ దెబ్బతో కాంగ్రెస‌ అయ్యర్‌ను సస్పెండ్‌ చేసి, నష్టనివారణ చర్యలు తీసుకుంది. అంతేకాదు గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓడిపోవ‌డానికి ఓ ర‌కంగా అయ్య‌ర్ వ్యాఖ్య‌లు దోహద ప‌డ్డాయ‌ని ప‌లువురు పొలిటికల్ క్రిటిక్స్ అభిప్రాయ‌ప‌డ్డారు.
తాజాగా క‌రాచీలో ఓ ఫంక్ష‌న్లో పాల్గొన్న అయ్య‌ర్ నేను పాకిస్థాన్‌ను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే భారత్ ప్రేమిస్తున్నాను కాబట్టి అంటూ.. పాకిస్థాన్‌పై ప్రేమను వ్యక్తపరిచారు. భారత్ తనను తాను ఎంత ప్రేమిస్తుందో.. పొరుగు దేశాన్ని కూడా అంతే ప్రేమించాలని హితవు పలికారు.
సమస్యల పరిష్కారం కోసం ఇరు దేశాలూ నిరంతరం చర్చలు జరపాల్సిన అవసరం ఉందని కేంద్ర మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. ఇంతటితో ఆగకుండా.. నిరంతరం చర్చలు జరపడానికి ఇస్లామాబాద్ అంగీకరించింది. కానీ న్యూఢిల్లీ ఒప్పుకోలేదన్నారు. ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి నిరంత చర్చలు ఒక్కటే మార్గమని చెప్పారు.
కశ్మీర్, భారత మార్గదర్శకత్వంలో పని చేసే ఉగ్రవాదం అనేవి రెండు ప్రధాన సమస్యలంటూ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫర్వేజ్ ముషార్రఫ్ హయాంలో రూపొందించిన విధానాన్ని ఇరు దేశాలు అనుసరించాలని అయ్యర్ సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories