logo

కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ సభ్యత్వం రద్దు

కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ సభ్యత్వం రద్దు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ నిన్న గవర్నర్ ప్రసంగం సందర్భంగా అసెంబ్లీలో దురదుష్టకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని, దీనిపై తీవ్ర మనస్థాపం చెందినట్లు తెలిపారు. అనంతరం శాసనసభ నుంచి కాంగ్రెస్ సభ్యులను సస్పెన్షన్ చేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. నిన్న సభలో అనుచితంగా ప్రవర్తించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ ల అసెంబ్లీ సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. మిగతా కాంగ్రెస్ సభ్యులపై వేటు పడింది. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మాధవరెడ్డి, డీకే అరుణ, భట్టి విక్రమార్క, రామ్మోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, పద్మావతిరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

లైవ్ టీవి

Share it
Top