logo

కొండమీద ఉన్న కోడి దిగొచ్చింది..

కొండమీద ఉన్న కోడి దిగొచ్చింది..

కార్తీకమాసం ఎఫెక్ట్‌తో ధరలు కుప్పకూలాయి. ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. అయినా కొనేందుకు జనం రావడం లేదు. దీంతో ఆ షాపులు వెలవెలబోతున్నాయి. ఇంతకీ ఆ షాపులేంటి? ఆ వ్యాపారమేంటి అనుకుంటున్నారా? లుక్. కొండమీద ఉన్న కోడి దిగొచ్చింది. దాని ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చేశాయి. అయినా కార్తీకమాసం కావడంతో కొనేవారు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండటంతో ధరలు మరింతగా దిగజారిపోతున్నాయి. దీంతో చికెన్ వ్యాపారులతోపాటు పౌల్ట్రీ వారికీ నష్టాలు తప్పడం లేదు. మాంసం ప్రియులను ఆకర్షించేందుకు ఎన్నో ఆఫర్స్ ప్రకటిస్తున్నా జనం అంతగా ఆసక్తి చూపడం లేదు.

గత నెలలో కేజీ చికెన్ ధర 190 నుంచి 200 వరకూ ఉంటే.. ఇప్పుడు కేజీ 140 రూపాయలకు పడిపోయింది. అయినా చికెన్ కొనేందుకు జనం రాకపోవడంతో 10 నుంచి 20 శాతం డిస్కౌంట్ అంటూ ఆఫర్‌లు ఇస్తున్నారు చికెన్ వ్యాపారులు. ఓ వైపు కార్తీకమాసం, మరోవైపు వరుసగా పండగలు రావడంతో నాన్‌ వెజ్ తినేవారు తగ్గిపోయారు. చేసేది లేక ఆఫర్లు ప్రకటించినా ఎవరూ రావడం లేదంటున్నారు వ్యాపారులు. మళ్లీ న్యూ ఇయర్ వస్తే గానీ వ్యాపారం పుంజుకోదని చెబుతున్నారు. కార్తీకమాసంలో శివుడికి పూజలు చేస్తాం కాబట్టి నాన్ వెజ్ తినమని చెబుతున్నారు పబ్లిక్. ఆ నెల మొత్తం నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటామని చెబుతున్నారు. అందుకే ప్రతిఏటా ఈ సీజన్‌లో నాన్‌వెజ్ ధరలు తగ్గిపోవడం కామన్ అంటున్నారు. మొత్తానికి కార్తీకమాసం ఎఫెక్ట్ చికెన్ వ్యాపారులపై పడింది. దీంతో వ్యాపారాలు లేక వ్యాపారులు విలవిల్లాడిపోతున్నారు.

లైవ్ టీవి

Share it
Top