logo

చిరుపై అమితాబ్ తెలుగు ట్వీట్.. చూశారా?

చిరుపై అమితాబ్ తెలుగు ట్వీట్.. చూశారా?

నట శిఖరం అమితాబ్ బచ్చన్.. హైదరాబాద్ చేరుకున్నారు. చిరంజీవి తాజా సినిమా సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్రలో నటించబోతున్న బిగ్ బీ.. తన పార్ట్ షూటింగ్ కు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా.. అమితాబ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “సూపర్ స్టార్ చిరంజీవి.. అదే ఫ్రేమ్ లో ఓ గౌరవం ఉండాలి”.. అంటూ చిరుపై తన అభిమానాన్ని చాటుకున్నారు.

ఏ సందర్భంలో కలిసినా.. ఎప్పుడు మాట్లాడినా.. చిరంజీవిపై అమితాబ్ తన అభిమానాన్ని ఇలాగే చూపిస్తుంటారు. డ్యాన్స్, ఫైట్స్, యాక్టింగ్ అన్నిట్లో నంబర్ వన్ గా ఉన్న చిరంజీవే.. తనకన్నా అసలైన మెగాస్టార్ అని కూడా అంటుంటారు. అలాంటి చిరంజీవి చారిత్రక పాత్రలో నటిస్తుండడం.. తన గురువు పాత్రలో నటించాలని కోరడంతో.. అమితాబ్ కాదనలేకపోయారు.

అలా అడగ్గానే.. ఇలా నటించేందుకు ఒప్పేసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి షూటింగ్ కూ రెడీ అయిపోయారు. చిరుపై తన మనసులోని ఆప్యాయతను ట్వీట్ రూపంలో పంచుకున్నారు. ఇది.. మెగాభిమానులను ముచ్చటగొలుపుతోంది. బిగ్ బీ తీరు.. వారికి అమితానందాన్ని కలిగిస్తోంది.

arun

arun

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top