Petrol and Diesel Price Today: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Today Petrol Price in Hyderabad Delhi Mumbai Kolkata Chennai Diesel Price Today 01 11 2021
x

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు(ఫైల్ ఫోటో)

Highlights

* హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.114.13, డీజిల్ రూ.107.40 * దేశవ్యాప్తంగా లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 35పైసలు పెంపు

Petrol and Diesel Price Today: రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల సామాన్యుడిపై అదనపు భారం పడుతోంది. రోజురోజుకు పెరిగిపోతున్న ఈ ధరల వల్ల సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. తాజాగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 35 పైసలు చొప్పున పెరిగాయి.

దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 109.69, డీజిల్ 98రూపాయల 42 పైసలు పెరిగింది. అటు ముంబైలో లీటర్ పెట్రోల్ 115.50, డీజిల్‌ 106 రూపాయల 62 పైసలకు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ 110రూపాయల 15పైసలు, డీజిల్ 101రూపాయల 56పైసలకు పెరిగింది.

చెన్నైలో పెట్రోల్ 106.35, డీజిల్‌ 102 రూపాయల 59పైసలకు చేరింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 41 పైసలు, డీజిల్‌పై 42 పైసల చొప్పన పెరిగాయి. దీంతో పెట్రోల్ ధర 114 రూపాయల 13 పైసలు, డీజిల్ ధర 107 రూపాయల 40పైసలకు చేరింది.

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ ప్రభావం పలు ఉత్పత్తులపై పడనుంది. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను పెంచుతున్నాయి.

దీంతో రవాణా భారంగా మారుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలకు తోడు బొగ్గు ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో సిమెంట్, ఏవియేషన్, FMCG రంగాలకు భారం కానుంది. ఈ భారం ప్రజలపై పడే అవకాశాలు ఉంటాయి.

బొగ్గు, చమురు ధరలు గత కొన్నాళ్లుగా పెరుగుతుండటంతో ఈ ప్రభావం ద్రవ్యోల్భణం పైన మాత్రమే కాకుండా, వివిధ రంగాలపై ప్రభావం చూపనుందని బ్యాంక్ ఆఫ్ అమెరికన్ సెక్యూరిటీస్ అనలిస్ట్స్ చెబుతున్నారు. మొత్తంగా ఒక్క అక్టోబర్ నెలలో చమురు ధరలు 20 సార్లు పెరిగాయి.

అటు ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య పెట్రోల్ ధరల విషయంలో విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్రంగా సాగుతున్నాయి. అయితే ఎవరి వాదన ఎలా ఉన్నా సామాన్యులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఇటు రైతులు కూడా సంతోషంగా లేరు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories