Kadiam: పెళ్లికి వచ్చి వధువును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం.

They Tried To Kidnap The Bride Who Came For The Wedding
x

Kadiam: పెళ్లికి వచ్చి వధువును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం. 

Highlights

Kadiam: తూర్పుగోదావరి జిల్లా కడియంలో విచిత్ర ఘటన..

Kadiam: తూర్పుగోదావరి జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కడియంలో జరుగుతున్న పెళ్లి వేడుకలో వధువు కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం గొడిగనూరుకు చెందిన గంగవరం స్నేహ., కడియంకు చెందిన బత్తిన వెంకట నందు కలిసి నరసరావుపేటలోని ఓ కాలేజీలో వెటర్నరీ డిప్లొమా కోర్సు చదివారు. ఇద్దరి మధ్య పరిచం ప్రేమగా మారింది. ఈనెల 13న విజయవాడలోని దుర్గగుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కడియం చేరుకున్న నూతన దంపతులు పెద్దలకు చెప్పారు. బంధువుల సమక్షంలో మరోసారి వివాహం చేసేందుకు ఈనెల 21న ముహూర్తం నిర్ణయించారు.

కడియంలోని ఓ ఫక్షన్ హాల్లో వివాహం జరుగుతుండగా వధువు తరపు వాళ్లు సైతం అక్కడికి చేరుకున్నారు. బంధువులపై కారం చల్లి వధువును అపహరించేందుకు ప్రయత్నించారు. దాడిని ప్రతిఘటించేందుకు వరుడు వెంకటనందుతో పాటు అతని బంధువులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో బత్తిన వీరబాబుకు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై వరుడు తరపు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వధువు కిడ్నాప్ యత్నంతో పాటు బంగారం చోరికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories