TTD Board Members: హాట్‌టాపిక్‌గా మారిన టీటీడీ బోర్డు మెంబర్ల నియామకం..

The Appointment Of TTD Board Members Became A Hot Topic
x

TTD Board Members: హాట్‌టాపిక్‌గా మారిన టీటీడీ బోర్డు మెంబర్ల నియామకం.. 

Highlights

TTD Board Members: టీటీడీ బోర్డు సభ్యుల నియామకాన్ని తప్పుబడుతున్న జనసేన

TTD Board Members: ఏపీ ప్రభుత్వం ప్రకటించిన టీటీడీ బోర్డు మెంబర్ల లిస్ట్‌పై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారి తీసింది. నేర చరిత్ర కలిగినవారిన పాలకమండలి సభ్యులుగా నియమించారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. 24 మందితో టీటీడీ బోర్డు సభ్యులను ప్రకటించారు. అందులో ఇద్దరి పేర్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పలు కేసుల్లో చిక్కుకున్న శరత్ చంద్రారెడ్డి, కేతన్ దేశాయిలకు టీటీడీ ధర్మకర్తల మండలిలో చోటు కల్పించినందుకు ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏడవ నిందితుడిగా ఉన్నారు శరత్ చంద్రారెడ్డి. జైలుకు కూడా వెళ్లారు. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నారు. అలాంటి శరత్ చంద్రారెడ్డిని టీటీడీ మెంబర్‌గా నియమించడాన్ని తప్పుబడుతున్నారు. గుజరాత్‌కు చెందిన కేతన్ దేశాయ్‌ పైనా వివాదం నడుస్తోంది. గుజరాత్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఆయనపై 8 కేసుల్లో ఎఫ్ఆర్‌ఐలు నమోదయ్యాయి. ప్రస్తుతం రెండు కేసులలో నిందితుడుగా ఉన్నారు. అలాంటి కేతన్ దేశాయ్‌ని టీటీడీ బోర్డులో ఎలా నియమిస్తాంటూ విమర్శలు వస్తున్నాయి.

ఇప్పటికే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి మతంపై ఆరోపణలు ఉండగా.. ఇప్పుడిలా బోర్డు సభ్యుల నియామకం సైతం కాంట్రవర్సీగా మారడం కలకలం రేపుతోంది. తీహార్‌ జైలులో ఉన్న వారితో టీటీడీ పాలక మండలి లిస్ట్‌ తయారు చేశారా అని.. ఆర్థిక నేరాలు చేసి జైలుకు వెళ్లొచ్చినవారికి టీటీడీ బోర్డు మెంబర్లను చేశారా? అని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మరో వైపు బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి టీటీడీ మెంబర్ల నియామకంపై దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణకు రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories