Jordar News: పుష్పను మించిన ట్విస్ట్..

Jordar News: సినిమాల్లోని సీన్ల కంటే విచిత్రంగా గంజాయిని రవాణా చేస్తున్న స్మగ్లర్లు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 Jun 2026 7:18 AM IST
Jordar News
X

Jordar News: పుష్పను మించిన ట్విస్ట్..

Jordar News: వీల్ల తెలివి తెల్లార. గీజర్ను నీల్లు కాగవెట్టెతందుకే వాడ్తరని తెల్సుకనీ., ఇట్ల గూడ వాడచ్చని ఇప్పటిదాంక తెల్వది గదా. నీళ్లు గరమయ్యే మిషిన్ల, నిషా ఎక్కిచ్చే 15 కిలోల గంజాయి పొట్లాలను దాశి, దేశాలే దాటియ్య సూశిర్రు ఈ దొంగ బద్మాష్ గాల్లు. బైటి దేశం మలేషియాలున్న కౌలాలంపూర్ ఇమానం డిపో కెంచి, ఢిల్లీ ఇమానం డిపోలకు సక్సెస్ ఫుల్గ గీజర్లను పట్కచ్చిర్రు ఇద్దరు మోతెవర్లు.

మరి గాన్నుంచి గీజర్లు పట్కచ్చుడేందని డౌటన్మానాలు కొట్టి, గీజర్ను పక్కున పల్గొడ్తె ఈల్ల బండారం బైటవడ్డది. లోపట దాశ్న ఈ నిషా మాల్కు మార్కిట్ల 5 కోట్ల రూపాల ధర వల్కుతట. మరి దేశంల ఏడికి జారగొడ్తున్నరు ఏందనేది, ఎర్కవట్టే పన్లెవడ్డరు ఇమానం డిపో పోలీసులు. ఇది ఇట్లుంటే.. గీడొగడు పోలీసులు శెకింగత్తున్నరని ఏం జేశిండో సూడుర్రి.

వామ్మో.. వీడింక వేరే ఉన్నడు గదా. గంజాయి పొట్లాన్ని సీదా కుక్కర్ల దాశే అన్నం ఉడ్కవెడ్తున్నడు గద. కేరళ రాష్టం త్రిస్సూర్ల బినీష్ అనెటోడు దగ్గర్దగ్గర అర్దకిల గంజాయి ఆకులను అన్నంల దాశి పట్టువడ్డడు. ఈ మోతెవరికి పోలీసులత్తున్నది ముందే ఎర్కైందట. ఉన్న గంజాయిని అప్పటికప్పుడు ఏడ దాశ్నా సూత్తరని, అన్మానంరాకుంట సగం ఉడ్కిన అన్నంల దాశిండట. ఎంత ఎంకులాడినా దొర్కలేదట కనీ, రందితోని ఖాకీలు స్టేషన్కు పోతాంటే విజిల్ సప్పుడు జేశి కుక్కర్ పట్టిచ్చింది.

గప్ప గప్ప గంజాయాకుల గబ్బు సుతం కొట్టిందట. ఇగ ఎంబటే.. గంజు దింపి సూత్తె ఈ స్మగ్లర్ గాని అత్కె తెల్వి బైటవడ్డది. ఇసొంటి అత్కె తెల్వి స్మగ్లర్లున్నంత కాలం, పుష్ప సీరీస్లకు కొదువే ఉండది గావచ్చు పోర్రి. డైరెక్టర్లకు స్మగ్లింగ్ ఆలోషనలకు కరువే ఉండదని అనవట్టిర్రు ఈ స్మిగ్లింగులను సోషల్ మీడియాల షేర్ జేస్తున్న కొందరు నెటిజన్లు.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story