Hyderabad: ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్‌ఎంసీ బంపర్ ఆఫర్..!

Hyderabad: హైదరాబాద్ నగరవాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అదిరిపోయే శుభవార్త చెప్పింది.

Arun Chilukuri
Published on: 12 March 2026 2:36 PM IST
Hyderabad: ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్‌ఎంసీ బంపర్ ఆఫర్..!
X

Hyderabad: ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్‌ఎంసీ బంపర్ ఆఫర్..!

Hyderabad: హైదరాబాద్ నగరవాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అదిరిపోయే శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలను చెల్లించే వారికి భారీ ఊరటనిస్తూ 'వన్ టైమ్ సెటిల్మెంట్' (OTS) పథకాన్ని ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) సంబంధించి బకాయి ఉన్న పన్నును ఈనెల 31వ తేదీలోగా చెల్లిస్తే, వడ్డీపై ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

ఎక్కడ, ఎలా చెల్లించాలి?

పన్ను చెల్లింపుదారులు తమ బకాయిలను సులభంగా చెల్లించేందుకు జీహెచ్‌ఎంసీ పలు మార్గాలను అందుబాటులోకి తెచ్చింది:

ఆన్‌లైన్: అధికారిక వెబ్‌సైట్ www.ghmc.gov.in ద్వారా నేరుగా చెల్లించవచ్చు.

యాప్: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు MY GHMC యాప్ ద్వారా నగదు జమ చేయవచ్చు.

కేంద్రాలు: సమీపంలోని మీసేవా (MeSeva) కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్లు (CSC) లేదా జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు.

కమిషనర్ విజ్ఞప్తి

ఈ అవకాశాన్ని నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. సకాలంలో పన్నులు చెల్లించి పెనాల్టీల భారం నుంచి తప్పించుకోవాలని, తద్వారా నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గడువు ముగిసిన తర్వాత పాత బకాయిలపై పూర్తిస్థాయి వడ్డీ వసూలు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story