పిక్సెల్ 11లో రాబోతున్న దిమ్మతిరిగే ఫీచర్.. ఐఫోన్ కంటే మరింత స్టైలిష్‌గా..!
Google Pixel 11 leak: కొత్త ఏఐ టెక్నాలజీలను పరిచయం చేసే క్రమంలో, గూగుల్ తన రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్ పిక్సెల్ 11 (Google Pixel 11) డిజైన్‌ను పొరపాటున లీక్ చేసినట్లు తెలుస్తోంది.
పిక్సెల్ 11లో రాబోతున్న దిమ్మతిరిగే ఫీచర్.. ఐఫోన్ కంటే మరింత స్టైలిష్‌గా..!
Google Pixel 11 leak: గూగుల్ పిక్సెల్ ప్రియులకు అదిరిపోయే వార్త. ఇటీవల జరిగిన గూగుల్ ఐఓ 2026 వేదికగా పిక్సెల్ 11 సిరీస్‌కు సంబంధించిన ఒక అద్భుతమైన ఫీచర్ లీకైండి. స్మార్ట్‌ఫోన్ వెనుక భాగం జిగేల్ మనేలా రూపొందించిన ఈ 'పిక్సెల్ గ్లో' ఫీచర్ ఇప్పుడు టెక్ ప్రపంచంలో సెన్సేషన్‌గా మారింది. ఆ వివరాలు మీకోసం..
టెక్ దిగ్గజం గూగుల్ ప్రతి ఏటా నిర్వహించే 'ఐఓ' ఈవెంట్ ఈసారి ఊహించని మలుపు తిరిగింది. కొత్త ఏఐ టెక్నాలజీలను పరిచయం చేసే క్రమంలో, గూగుల్ తన రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్ పిక్సెల్ 11 (Google Pixel 11) డిజైన్‌ను పొరపాటున లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఫోన్ వెనుక కెమెరా ప్యానెల్ చుట్టూ మెరిసే కాంతి పట్టీని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఏమిటీ 'పిక్సెల్ గ్లో' ఫీచర్?
గూగుల్ ఐఓ 2026 కీనోట్ ప్రసంగంలో 'జెమిని ఓమ్ని' (Gemini Omni) సామర్థ్యాలను వివరిస్తున్న సమయంలో ఒక డెమో వీడియోను ప్రదర్శించారు. అందులో ఒక మోడల్ చేతిలో ఉన్న ఫోన్ వెనుక కెమెరా బార్ చుట్టూ ఒక్కసారిగా నియాన్ లైట్లు వెలిగాయి. దీనినే టెక్ వర్గాలు 'పిక్సెల్ గ్లో' (Pixel Glow) అని పిలుస్తున్నాయి. 'నథింగ్ ఫోన్'లోని గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ తరహాలో, ఫోన్‌ను బోర్లా పెట్టినప్పుడు కూడా నోటిఫికేషన్లు, కాల్స్ గురించి తెలుసుకునేలా ఇది పని చేస్తుంది.
ఆండ్రాయిడ్ 17 కోడ్‌లోనూ ఆధారాలు..
నిజానికి ఈ ఫీచర్ గురించిన గుసగుసలు గత నెలలోనే మొదలయ్యాయి. ఆండ్రాయిడ్ 17 బీటా 4 (Android 17 Beta 4) కోడ్‌లో దీనిని "ఆర్బిట్" (Orbit) అనే రహస్య నామకరణంతో పొందుపరిచినట్లు నిపుణులు గుర్తించారు. ఫోన్ వెనుక ఉండే ఈ ఎల్ఈడీ స్ట్రిప్ కేవలం నోటిఫికేషన్లకే కాకుండా, జెమిని ఏఐ (Gemini AI) స్పందనలకు అనుగుణంగా కూడా రంగులు మారుతుందని సమాచారం.
పిక్సెల్ 11 లో సరికొత్త చిప్‌సెట్..
ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న 'మేడ్ బై గూగుల్' ఈవెంట్‌లో పిక్సెల్ 11 సిరీస్‌ను అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో గూగుల్ సొంతంగా అభివృద్ధి చేసిన టెన్సర్ జీ6 (Tensor G6) చిప్‌సెట్‌ను వాడనున్నారు. దీనిని టీఎస్ఎంసీ (TSMC) సంస్థ 2 నానోమీటర్ ప్రక్రియతో తయారు చేయనుంది. దీనివల్ల ఫోన్ వేగం పెరగడమే కాకుండా, బ్యాటరీ లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుందని అంచనా.
ఏఐ విజువల్స్ కానుందా?
అయితే, ఆ వీడియోలో కనిపించిన మెరుపులు నిజంగా హార్డ్‌వేర్ ఫీచరా లేక ఏఐ సృష్టించిన విజువల్ ఎఫెక్టా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ, ఆండ్రాయిడ్ కోడ్‌లో ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉండటంతో, పిక్సెల్ 11లో ఈ 'గ్లోయింగ్' ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.
స్మార్ట్‌ఫోన్ రంగంలో ఎప్పుడూ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని అనుసరించే గూగుల్, ఈసారి పిక్సెల్ 11తో వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించబోతోంది. ఒకవేళ ఈ 'పిక్సెల్ గ్లో' ఫీచర్ గనుక నిజమైతే, స్టైల్, టెక్నాలజీ పరంగా గూగుల్ ఐఫోన్‌ను మించిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.




