Toguta: తొగుట నుంచి సైన్యంలోకి.. అగ్నివీర్‌లుగా ఎంపికైన యువకులకు ఘన సన్మానం!

Toguta: సిద్దిపేట జిల్లా తొగుటలో అగ్నివీర్‌లుగా ఎంపికైన యువకులకు సన్మానం.

Chindam Karunakar, Dubbak
Published on: 9 Jun 2026 11:02 AM IST
Toguta
X

Toguta: తొగుట నుంచి సైన్యంలోకి.. అగ్నివీర్‌లుగా ఎంపికైన యువకులకు ఘన సన్మానం!

సిద్దిపేట జిల్లా: తొగుట మండల కేంద్రంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో అగ్నివీర్‌లుగా ఎంపికై మన ప్రాంతానికి గర్వకారణంగా నిలిచిన యువకులు నక్క హేమంత్, నిఖిల్, నక్క నరేష్, అయ్య శివనాథ్ లను తొగుట తహశీల్దార్ మహమ్మద్ సమీర్ అహ్మద్ ఖాన్ గారితో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ (అమర్) రెడ్డి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ (అమర్) రెడ్డి గారు మాట్లాడుతూ దేశ సేవకు అంకితభావంతో ముందుకు వచ్చిన యువత ఆదర్శప్రాయమని కొనియాడారు. అగ్నివీర్‌లుగా ఎంపిక కావడం వారి కృషి, పట్టుదల మరియు క్రమశిక్షణకు నిదర్శనమని అన్నారు. మరింత మంది యువకులు సైన్యం, పోలీస్ మరియు ఇతర ప్రభుత్వ రంగ ఉద్యోగాల వైపు అడుగులు వేయాలని సూచించారు.

అనంతరం అగ్నివీర్‌లకు శాలువాలు కప్పి, ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో తొగుట సర్పంచ్ పాగల శోభ కొండల్ రెడ్డి, APM బాపు రావు, భరత్ తేజ, పరమేశ్వర్ రెడ్డి, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story