ఓటీటీలోకి వచ్చేసిన మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘మైఖేల్’!

Michael Jackson: ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను ఊగించిన ‘కింగ్ ఆఫ్ పాప్’ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన హాలీవుడ్ ప్రతిష్టాత్మక బయోపిక్ ‘మైఖేల్’.

Srinivas Rao
Published on: 9 Jun 2026 11:55 AM IST
Michael Jackson
X

ఓటీటీలోకి వచ్చేసిన మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘మైఖేల్’!

Michael Jackson: ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను ఊగించిన ‘కింగ్ ఆఫ్ పాప్’ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన హాలీవుడ్ ప్రతిష్టాత్మక బయోపిక్ ‘మైఖేల్’. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 1000 కోట్ల రూపాయల (900 మిలియన్ డాలర్లు) వసూళ్లతో అత్యధిక కలెక్షన్లు సాధించిన బయోపిక్‌గా రికార్డుల వైపు దూసుకెళ్తున్న ఈ విజువల్ వండర్ తాజాగా ఓటీటీ వేదికగా డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తెరకెక్కించిన ఈ చిత్రం భారతదేశంలోని మైఖేల్ జాక్సన్ అభిమానుల కోసం ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వచ్చింది.

ప్రీమియం రెంటల్ మోడల్‌లో స్ట్రీమింగ్.. ధరల వివరాలు

ఈ బ్లాక్‌బస్టర్ సినిమా ప్రస్తుతం సాధారణ సబ్‌స్క్రిప్షన్ లైబ్రరీలోకి రాకుండా, ప్రీమియం రెంటల్ (అద్దె) విధానంలో విడుదలైంది. భారతదేశంలోని వీక్షకుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో కొన్ని ప్రత్యేకమైన బోనస్ కంటెంట్‌తో కలిపి ఈ సినిమాను 399 రూపాయల అద్దె ధరతో అందిస్తోంది. అలాగే బుక్‌మైషో స్ట్రీమ్ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా డిజిటల్ రెంటల్ ధర 499 రూపాయలుగా నిర్ణయించారు. భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలోనూ ఇంగ్లీష్‌తో పాటు హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంచడం విశేషం. సాధారణ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లలో ఈ సినిమా ఉచితంగా చూడటానికి వీక్షకులు మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

థియేటర్లలోనూ కొనసాగుతున్న రచ్చ

ఈ చిత్రం డిజిటల్‌గా విడుదలైనప్పటికీ, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమాలో మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన సొంత సోదరుడి కుమారుడు జాఫర్ జాక్సన్ అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నారు. భారీ కొరియోగ్రఫీ, లైవ్ కాన్సెర్ట్ తరహా సౌండ్ డిజైన్‌తో కూడిన ఈ సినిమాను హోమ్ స్క్రీన్స్ కంటే బిగ్ స్క్రీన్‌పై చూడటానికే ప్రేక్షకులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మైఖేల్ జాక్సన్ బాల్యం, జాక్సన్ 5 బ్యాండ్ నుండి గ్లోబల్ సూపర్‌స్టార్‌గా ఎదిగిన ప్రస్థానంతో పాటు ఆయన కుటుంబంలో ఉన్న భావోద్వేగాలను ఈ చిత్రం ఆవిష్కరించింది. ఇందులో నియా లాంగ్, జూలియానో వాల్డి, కోల్‌మన్ డొమింగో ఇతర కీలక పాత్రలు పోషించారు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story