Giddalur: గిద్దలూరులో రూ. 22 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ!

Giddalur: ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నియోజకవర్గంలోని 25 మంది లబ్ధిదారులకు రూ. 22.23 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 24 May 2026 5:57 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరులో రూ. 22 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ!

గిద్దలూరు: అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి కొండంత అండగా నిలుస్తున్నారు. ఆదివారం ఉదయం గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 19వ విడత చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ విడతలో మొత్తం 25 మంది లబ్ధిదారులకు రూ. 22,23,540.00 (రూ. ఇరవై రెండు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల నలభై రూపాయలు) విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

సహకారంతో పేద ప్రజలు కూడా ధైర్యంగా కార్పొరేట్ వైద్యం చేయించుకోవచ్చనే భరోసాను కల్పిస్తున్నామన్నారు. ఆర్థిక స్థోమత లేక వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరంతరం ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు.

పేదలకు నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా కూటమి పాలన సాగుతోందని అన్నరు. గిద్దలూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 1068 మంది లబ్ధిదారులకు రూ. 8,89,99,433.00 (ఎనిమిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు ) ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించటం జరిగిందని, మరియు ప్రమాద భీమా ద్వారా 4 కుటుంబాలకు రూ. 20 లక్షలు అందచేశామని ఎమ్మెల్యే తెలిపారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story