Markapuram: పెద్దారవీడులో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం

Markapuram: మార్కాపురం జిల్లా పెద్దారవీడు ఎంఈవో కార్యాలయం ఆవరణలో టిడిపి ఇన్చార్జ్ ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో, శంకర కంటి ఆసుపత్రి వైద్య బృందం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం.

SREENIVAS YANNAM, MARKAPURAM
Updated on: 24 May 2026 2:32 PM IST
Markapuram
X

Markapuram: పెద్దారవీడులో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం

Markapuram: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండల ఎంఈవో కార్యాలయం ఆవరణలో యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి వైద్య బృందం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు.యర్రగొండపాలెం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో త్వరలోనే ఇలాంటి ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం తమకు ముఖ్యమని, నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.

శిబిరంలో వైద్యులు పలువురు రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించారు. కొంతమందిని శస్త్రచికిత్సల కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాసులు పెద్దారవీడు మండల టిడిపి అధ్యక్షుడు మెట్టు శ్రీనివాసుల రెడ్డి, మాజీ టిడిపి అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎంపీపీ నాగేశ్వరావు, మండల సీనియర్ నాయకులు సుబ్బరామిరెడ్డి, దుగ్గెంపూడి కొండారెడ్డి, జెడ్డా రవి, దొడ్డ భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఇండ్ల రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ ఏరు వెంకటనారాయణ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story