నో హైక్.. నో టెన్షన్! పెట్రోల్, గ్యాస్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన!
Central Govt Clarifies on Petrol and Diesel Prices No Hike in Fuel and LPG Rates Stocks Last for 2 Months
నో హైక్.. నో టెన్షన్! పెట్రోల్, గ్యాస్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన!
Petrol and Diesel Prices: దేశంలో ఇంధన ధరలు భారీగా పెరగనున్నాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ ధరలపై వస్తున్న వార్తలను కొట్టిపారేస్తూ పౌర సరఫరాల శాఖ కీలక స్పష్టతనిచ్చింది.
ధరల పెంపు ప్రసక్తే లేదు!
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఉద్దేశం ప్రస్తుతానికి ప్రభుత్వానికి లేదని కేంద్రం తేల్చి చెప్పింది. కేవలం పెట్రో ఉత్పత్తులే కాకుండా, సామాన్యుడి వంటింటి బడ్జెట్‌పై ప్రభావం చూపే డొమెస్టిక్ ఎల్పీజీ (LPG) సిలిండర్ల ధరలను కూడా పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసింది. దీంతో గత కొంతకాలంగా ధరల పెరుగుదలపై ఆందోళన చెందుతున్న సామాన్యులకు పెద్ద ఊరట లభించినట్లయింది.
రెండు నెలలకు సరిపడా నిల్వలు
చమురు కొరత ఏర్పడుతుందన్న ఊహాగానాలపై స్పందిస్తూ.. దేశంలో ఇంధన నిల్వలపై కేంద్రం గణంకాలను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో దాదాపు రెండు నెలలకు (60 రోజులు) సరిపడా పెట్రో నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, దేశీయంగా ఇంధన సరఫరాకు ఎటువంటి అంతరాయం లేదని, ప్రజలు పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని కేంద్రం సూచించింది. కేంద్రం ఇచ్చిన ఈ క్లారిటీతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.




