Nalgonda: నల్లగొండలో తృటిలో తప్పిన ముప్పు.. రోడ్డుపై భారీ ట్యాంకర్ బోల్తా!
Nalgonda: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఒక వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది.
Nalgonda: నల్లగొండలో తృటిలో తప్పిన ముప్పు.. రోడ్డుపై భారీ ట్యాంకర్ బోల్తా!
Nalgonda: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం తృటిలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. స్థానిక జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) క్యాంప్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఒక వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి అకస్మాత్తుగా బోల్తా పడింది. ట్యాంకర్ ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ఆ ప్రాంతంలో కాసేపు కలకలం రేగింది. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఆ మార్గంలో ఇతర వాహనాల రాకపోకలు ఏవీ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా క్రేన్ సహాయంతో ట్యాంకర్ను పక్కకు తొలగించారు.
Next Story




