Ram Charan: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్ చరణ్.. తప్పు జరిగిదంటూ

Ram Charan: బుచ్చిబాబు "పెద్ది" మూవీ ప్రమోషన్స్‌లో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Naresh.k
Published on: 24 May 2026 8:34 AM IST
Ram Charan
X

Ram Charan: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్ చరణ్.. తప్పు జరిగిదంటూ

Jasprit Bumrah: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ "పెద్ది". ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలుండగా.. తాజాగా చిత్రబృందం ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. అయితే, శనివారం భోపాల్‌లో జరిగిన ఒక గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్ ఇప్పుడు సరికొత్త వివాదానికి, సోషల్ మీడియా షేక్‌అప్‌కు వేదికగా మారింది. ఒక్క మాట.. ఒకే ఒక్క చిన్న పొరపాటు ఇప్పుడు టాలీవుడ్ టు క్రికెట్ సర్కిల్స్ వరకు హాట్ టాపిక్‌గా మారింది.

అసలేం జరిగింది?

భోపాల్ ఈవెంట్‌లో రామ్ చరణ్ స్టేజ్ ఎక్కి మాట్లాడుతుండగా, ఫ్లోలో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రస్తావన వచ్చింది. అయితే, ఊహించని విధంగా చరణ్ నోటి వెంట బుమ్రాను ఫుట్‌బాల్ ప్లేయర్ అనే పదం వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానించే ఒక గ్లోబల్ స్టార్.. ఇండియాలోనే మోస్ట్ పాపులర్ క్రికెటర్‌ను ఫుట్‌బాల్ ప్లేయర్ అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

సోషల్ మీడియాలో ట్రోల్స్

ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారింది. దాంతో క్రికెట్ ఫ్యాన్స్, నెటిజన్లు మెగా హీరోపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు.ఇండియాలో ఉంటూ బుమ్రా ఎవరో తెలియదా? అని కొందరు, గ్లోబల్ స్టార్‌కి కనీస అవగాహన లేదా? అని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇంత పెద్ద ఈవెంట్‌లో ఇలాంటి తప్పు దొర్లడం సిగ్గుచేటు అంటూ నెగెటివ్ ట్రెండ్స్ క్రియేట్ చేశారు.

క్షణాల్లో స్పందించిన చెర్రీ..

వివాదం పెద్దదవుతోందని గమనించిన రామ్ చరణ్.. ఏమాత్రం ఈగోకు పోకుండా, ఈవెంట్ ముగిసిన వెంటనే తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు. అది కేవలం నోరు జారడం వల్ల జరిగిన పొరపాటు మాత్రమే. కొన్నిసార్లు ఫ్లోలో నేను పేర్లు, ప్రొఫెషన్స్ కన్ఫ్యూజ్ అవుతుంటాను. జస్‌ప్రీత్ బుమ్రా అంటే నాకు ఎనలేని గౌరవం. నేను ఆయన ఆటకు వీరాభిమానిని. ప్రతి భారతీయుడు గర్వపడేలా బుమ్రా మన దేశానికి ఎన్నో విజయాలు అందించారు. నా పొరపాటుకు క్షమించండి అంటూ బుమ్రాను ట్యాగ్ చేశారు.

ఒకవైపు కొందరు నెటిజన్లు ఇప్పటికీ ట్రోల్ చేస్తుంటే, చరణ్ అభిమానులు మాత్రం తప్పు ఎవరైనా చేస్తారు.. కానీ అంత పెద్ద స్టార్ అయ్యుండి వెంటనే క్షమాపణలు చెప్పడం చరణ్ సంస్కారానికి నిదర్శనం అంటూ మద్దతుగా నిలుస్తున్నారు. ఏదేమైనా, ఈ ఒక్క ఇన్సిడెంట్‌తో "పెద్ది" సినిమా ప్రమోషన్స్ మాత్రం నేషనల్ వైడ్‌గా విపరీతమైన హైప్ తెచ్చుకున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story