Anumana Pakshi: అనుమాన పక్షి టీజర్ అదిరిపోయిందిగా...
Anumana Pakshi: డీజే టిల్లు సినిమాతో థియేటర్లలో నవ్వుల జాతర రేపిన డైరెక్టర్ విమల్ కృష్ణ గుర్తున్నాడుగా?
Anumana Pakshi: అనుమాన పక్షి టీజర్ అదిరిపోయిందిగా...
Anumana Pakshi: డీజే టిల్లు సినిమాతో థియేటర్లలో నవ్వుల జాతర రేపిన డైరెక్టర్ విమల్ కృష్ణ గుర్తున్నాడుగా? అవును, ఫస్ట్ సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ కొట్టిన ఈ టాలెంటెడ్ మేకర్.. ఇప్పుడు మరో డిఫరెంట్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో మన ముందుకు వస్తున్నాడు. ‘సినిమా బండి’ ఫేమ్ రాగ్ మయూర్ హీరోగా విమల్ కృష్ణ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీనే ‘అనుమాన పక్షి’. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, రాజేష్ జగతియాని, హీరాచంద్ దండ్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా క్రేజీ టీజర్‌ను మేకర్స్ వదిలారు.
గర్ల్‌ఫ్రెండ్‌ని కూడా వదలకుండా అనుమానించడమే!
ఇప్పటికే రాక్‌స్టార్ రమణ గోగుల వాయిస్‌లో వచ్చిన ‘గులాబ్ జామ్’ సాంగ్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇక ఇప్పుడు వచ్చిన టీజర్ చూస్తే సినిమా ఏ రేంజ్‌లో నవ్వించబోతోందో క్లియర్ హింట్ ఇచ్చేశారు. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ చాలా విచిత్రంగా, హిలేరియస్‌గా ఉంది.
మన కళ్లముందు ఉన్న ప్రతి ఒక్కరినీ అనుమానించడం హీరోకి ఉన్న ఒక అలవాటు.. కాదు కాదు అదో పెద్ద జబ్బు! ఎంతలా అంటే.. కన్నవాళ్లను, ప్రాణంగా చూసుకునే గర్ల్‌ఫ్రెండ్‌ని కూడా అస్సలు నమ్మడు. ప్రతి చిన్న విషయానికి వంద అనుమానాలు పెట్టుకుంటాడు. మరి ఈ వింత ప్రవర్తన వల్ల అతని లైఫ్‌లో ఎలాంటి గందరగోళం మొదలైంది? ఎలాంటి క్రేజీ సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది? అనే లైన్‌ను డైరెక్టర్ విమల్ కృష్ణ తన మార్క్ వన్-లైనర్స్, సిట్యుయేషనల్ కామెడీతో చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు.
జూలై 10న థియేటర్లలో నవ్వుల పండగే..
రొటీన్ ఫార్ములా కథ బోర్ కొట్టేసిన టైంలో.. ఇలాంటి ఒక ఫ్రెష్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాలో రాగ్ మయూర్ తన కామెడీ టైమింగ్‌తో ఇరగదీసేశాడనే చెప్పాలి. హీరోయిన్ మెరిన్ ఫిలిప్ కూడా చాలా క్యూట్‌గా ఇంప్రెస్ చేసింది. వీళ్లతో పాటు ప్రిన్స్ సీసిల్, రాశి, అజయ్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, మస్త్ అలీ (సలీం ఫేమ్) లాంటి పెద్ద తారాగణమే ఉంది.
సునీల్ కుమార్ నామ విజువల్స్ బాగుండగా.. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లి ఫన్ క్వోషెంట్‌ను పెంచేసింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ ‘అనుమాన పక్షి’ జూలై 10న థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయిపోయింది. థియేటర్లలో నవ్వుకోవడానికి గెట్ రెడీ!




