Medak: మెదక్‌ చీలపల్లిలో దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు

Medak: మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ మండలం చీలపల్లి గ్రామంలో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు పది రోజుల్లోనే ఛేదించారు.

NAGARAJ, MEDAK
Published on: 24 May 2026 5:47 PM IST
Medak
X

Medak: మెదక్‌ చీలపల్లిలో దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు

Medak: మెదక్ జిల్లాలో సంచలనం రేపిన భారీ దోపిడీ కేసును మెదక్ జిల్లాకి పోలీసులు ఛేదించారు పది రోజులలో దొంగలను అరెస్టు చేసి భారీ ఎత్తున బంగారాన్ని సాధనం చేసుకొని దొంగలను రిమాండ్ చేసిన పోలీసులు ఆదివారం మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ పెద్ద శంకరంపేట్ మండలం చీలపల్లి గ్రామంలోని ఈనెల 14 @ 15వ తేదీన అర్ధరాత్రి జరిగిన భారీ దోపిడీ జరిగింది.

సుమారు ఐదు ఇండ్లలో తాళాలు పగలగొట్టి బంగారం వెండి చోరీ చేసిన దొంగలు ఎట్టి కేసులలో పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఇట్టి కేసులో 109 తులాల తొమ్మిది గ్రాముల బంగారం రెండున్నర కిలోల వెండి 19వేల రూపాయలను దోపిడీ చేసిన దొంగల నుండి. ఇట్టి కేసులో 929.7 బంగారాన్ని 1.7 కిలోల వెండిని సాధీనం. చేసుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు.ఈ కేసులో A 1 జాదవ్ శ్రీరామ్ నాయక్ A3 జాదవ్ మలి బాయ్ అరెస్టు చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని ఆయన అన్నారు. మరో ఇద్దరు పరారులో ఉన్నట్టు ఎస్పీ అన్నారు. నిందితులు

కామరెడ్డి నిజామాబాద్ జిల్లాలో కేసులు ఉన్నాయి మెదక్ 5 కేసులో నవోదయై మొత్తం 17 కేసులు నమోదైన ఎస్పీ తెలిపారు. ఈ కేసులో చోరీ ఘటనపై క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నామని తెలిపారు. గ్రామ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తూ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు ఎవరైనా ఊరికి వెళ్లే ముందు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని. గ్రామాలలో ప్రజలు వేసవి కాలం కాబట్టి ఇళ్లకు తలలు వేసి డాబాల పైన పడుకోకూడధు అని సూచించారు. మరియు cc కేమరాలు తప్పని సరీ పెట్టుకోవాలని చూచించినారు. ఎక్కువ బంగారం ఉంటే బ్యాంక్ లాకర్ లో పెట్టుకోవాలని ప్రజలకు తెలియపరిచినరు.

సహాయం కోసం సంప్రదించండి:

డైల్ 100 లేదా మీ స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని జిల్లా ప్రజలకు ఎస్పీ సూచించారు.అనంతరం బాధితులు పోలీసులు కేసును తొందరగా ఛేదించినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతూ శాలువాలతో ఘనంగా సన్మానించారు

మీడియా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పి తో పాటు మెదక్ డియస్పీ ప్రసన్న కుమార్, సీఐలు రేణుక రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి, జార్జి.ఎస్ఐలు ప్రవీణ్ రెడ్డి, శంకర్, రేగోడు ఎస్సై పోచన్న .పెద్ద శంకరంపేట్ పోలీసులు, క్లూస్ టీమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story