Markapuram: మార్కాపురం కలెక్టరేట్‌లో హరితహారం.. మొక్కలు నాటిన కలెక్టర్ విజయ సునీత!

Markapuram: మార్కాపురం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాల్లో భాగంగా హరితహారం కార్యక్రమం. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చిన కలెక్టర్ ఎం. విజయ సునీత.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 8 Jun 2026 2:49 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం కలెక్టరేట్‌లో హరితహారం.. మొక్కలు నాటిన కలెక్టర్ విజయ సునీత!

మార్కాపురం: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి హరితహారానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. చెట్ల పెంపకం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.

కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, డీడీఓ బాలు నాయక్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాలాజీ నాయక్, డీపీఆర్వో మోహన్ రాజు తదితర జిల్లా అధికారులు పాల్గొని మొక్కలు నాటారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story