Kothagudem: ప్రొఫెసర్ కోదండరామ్‌కు విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలి

Kothagudem: జూన్ 2 తెలంగాణ దినోత్సవం నాటికి తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 24 May 2026 4:04 PM IST
Kothagudem
X

Kothagudem: ప్రొఫెసర్ కోదండరామ్‌కు విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలి

కొత్తగూడెం: విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్ లో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నాయకులు. నవతన్ అధ్యక్షతన విలేకరుల సమావేశం.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిథి పొనుగోటి సంపత్ నాయుడు,యాకయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..

ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, జూన్ 2 తెలంగాణ దినోత్సవం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులకు సరైన గౌరవం ఇవ్వాలని కోరారు.. లేకుంటే తెలంగాణ ఉద్యమం కోసం ఆనాడు ఏరీతిగా ఏకమయ్యామో.. అదే రీతిగా తెలంగాణ ఉద్యమకారులంతా ఏకమవుతామని, మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించారు.

కేకే నేతృత్వంలోని కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి కేటగిరీల వారీగా నిజమైన ఉద్యమకారులను గుర్తించాలి. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం కోసం తొలి, మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని, విద్యార్థి ఉద్యమ నాయకులు తమ సర్వస్వాన్ని కోల్పోయారని, అటువంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవిస్తామని, వారిని అన్ని విధాల ఆదుకుంటామంటూ ప్రగల్బాలు పలికి రెండున్నర ఏళ్ళు గడుస్తున్నా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన, పోరాడిన ఉద్యమకారులను గుర్తించి గౌరవించేందుకు వారిని అన్ని రకాల తోడ్పాటును అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రభుత్వ సలహాదారు.

కె. కేశవరావు (కేకే) నేతృత్వంలో ప్రత్యేక కమిటీని‌ తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు శ్రీ కృష్ణ కమిటీ. ఏ విధంగా క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇచ్చిందో, అదేవిధంగా కే కే కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి నిజమైన ఉద్యమకారులను క్యాటగిరీల వారీగా గుర్తించాలని తెలిపారు. మలిదశ ఉద్యమంలో అమరులైన కుటుంబాలు.

కేటగిరీ 2: లాఠీచార్జీలు, పోలీస్ చర్యల్లో గాయపడినవారు.

కేటగిరీ 3: ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లినవారు, కేసులు నమోదైనవారు.

కేటగిరీ 4: క్షేత్రస్థాయిలో ఉండి ఉద్యమంలో పాల్గొన్నవారిని

జిల్లాల వారీగా పర్యటించి అభిప్రాయ సేకరణ జరపాలన్నారు.

ప్రభుత్వానికి వాస్తవ నివేదిక ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1250 కుటుంబాలల్లో అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం 750 కుటుంబాలకు అన్ని రకాలుగా తోడ్పాటు అందించినట్లు అసెంబ్లీ సాక్షిగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, మిగిలిన 500 కుటుంబాలకు ప్రస్తుత ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందించాలని డిమాండ్ చేశారు.

ఉద్యమ కాలంలో జైల్లోకి వెళ్లిన వారికి న్యాయం చేయాలని, ఫేక్ ఎఫ్ఐఆర్ లను సృష్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఐడి కార్డు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పథకాల్లో మెజారిటీగా తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

జై తెలంగాణ అంటే నై తెలంగాణ అన్న వాళ్లకు మంత్రి పదవులు కట్టబెట్టారని , కోట్ల రూపాయల వెనుక వేసుకుంటున్నారని, త్యాగాలు ఒకరివి, భోగభాగ్యాలు మరొకరు అనుభవిస్తున్నారని విమర్శించారు.

ప్రొఫెసర్ కోదండరామ్ జై తెలంగాణ అంటే జై జై తెలంగాణ అంటూ నడిచామని, ప్రొఫెసర్ కోదండరామ్ అడుగు జాడల్లో నడవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రొఫెసర్ కోదండరామ్ కు విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలి..

జూన్ 2న తొలి మలి దశ తెలంగాణ ఉద్యమకారులకు సరైన గుర్తింపు గౌరవం ఇవ్వాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేకుంటే మంత్రులను, ఎమ్మెల్యేల కార్యక్రమాలను అడ్డుకుంటామని , అవసరమైతే ముఖ్యమంత్రి కార్యక్రమాలను చేత అడ్డుకుంటామని,ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో క్రాంతి,సాంబ పూర్ణ,తెలంగాణ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story