Karimnagar: బాలికల సంక్షేమమే లక్ష్యం.. కరీంనగర్‌లో 'బేటీ బచావో'పై కీలక సమీక్ష!
Karimnagar: కరీంనగర్‌లో 'బేటీ బచావో – బేటీ పడావో' పథకంపై సమీక్ష. అంగన్వాడీ భవనాలు, మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అశ్విని తనాజ వాకడే ఆదేశం.
Karimnagar: బాలికల సంక్షేమమే లక్ష్యం.. కరీంనగర్‌లో 'బేటీ బచావో'పై కీలక సమీక్ష!
కరీంనగర్: మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి సరస్వతి ఆధ్వర్యంలో బేటీ బచావో – బేటీ పడావో పథకం 2026–27 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అడిషనల్ కలెక్టర్ మరియు బేటీ బచావో – బేటీ పడావో నోడల్ అధికారి అశ్విని తనాజ వాకడే అధ్యక్షత వహించారు.సమావేశంలో బాలికల సంక్షేమం మరియు విద్య కోసం పథకం నిధులను ఎలా వినియోగించాలనే విషయంపై చర్చించారు.
అలాగే వచ్చే సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాల పురోగతిని సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న అంగన్వాడీ భవనాలు, మరుగుదొడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ వాటికలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల నమోదు సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని సూచించారు.
మిషన్ వాత్సల్య పథకం కింద గ్రామాల్లో ఉన్న అర్ఫాన్ మరియు సెమీ ఆర్ఫాన్ పిల్లలను గుర్తించి వారికి అవసరమైన సహాయం అందించాలని తెలిపారు. సఖి కేంద్రం ద్వారా మహిళలకు అందిస్తున్న సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు.పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం అమలులో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కమిటీలను ఏర్పాటు చేసి పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు, సీడీపీవోలు, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.




