Karimnagar: కౌమార బాలికల ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన మేయర్ కొలగాని

Karimnagar: కరీంనగర్ 2వ డివిజన్ తీగలగుట్టపల్లి బస్తీ దవాఖానాలో మెప్మా ఆధ్వర్యంలో కౌమార బాలికల ఉచిత హెల్త్ క్యాంపు జరిగింది.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 24 May 2026 12:54 PM IST
Karimnagar
X

Karimnagar: కౌమార బాలికల ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన మేయర్ కొలగాని

కరీంనగర్ : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద కరీంనగర్ నగరంలోని 2వ డివిజన్‌ తీగలగుట్టపల్లి లోని బస్తీ దావాఖానా లో కౌమార బాలికల హెల్త్ క్లీనింగ్ క్యాంపును నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ ఆరోగ్య శిబిరంలో కిశోర బాలికలకు అవసరమైన హెచ్‌బి, ఎనీమియా, హైట్, వెయిట్, సీబీపీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన క్యాన్సర్ నివారణ ఇంజెక్షన్లు అందజేశారు.

ఈ సందర్భంగా నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.అలాగే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అందిస్తున్న విద్యా అవకాశాలను తీగలగుట్టపల్లి ప్రాంతానికి చెందిన కౌమార దశ పిల్లలు వినియోగించుకోవడం విశేషంగా నిలిచింది అన్నారు.బాలికల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పీడీ స్వరూపారాణి గారు, సీఓ సునీత గారు, ఆర్ పి లు, డివిజన్ ప్రజలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story