Uppal: ఆలయ నిర్మాణానికి రాజకీయాలకు అతీతంగా సహకరించాలి.. ఎమ్మెల్యే

Uppal: ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకనగర్ శ్రీ చిలుకేశ్వర ఆంజనేయ స్వామి దేవాలయంలో కంచి పీఠాధిపతుల ఆశీస్సులతో నిర్వహించనున్న కోటిలింగాల స్థాపన.

KARUNAKAR, UPPAL
Published on: 24 May 2026 6:33 PM IST
Uppal
X

Uppal: ఆలయ నిర్మాణానికి రాజకీయాలకు అతీతంగా సహకరించాలి.. ఎమ్మెల్యే

ఉప్పల్: ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకనగర్‌లో నిర్మాణంలో ఉన్న హరిహర క్షేత్రం శ్రీ చిలుకేశ్వర ఆంజనేయ స్వామి దేవాలయం సన్నిధిలో జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి, శ్రీ కంచి కామకోటి పీఠాధిపతుల వారి దివ్య ఆశీస్సులతో కోటిలింగాల స్థాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కోటిలింగాల బుక్కింగ్, కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణానికి సహకరించాలని, ఆలయ పునర్నిర్మాణంలో భక్తులు, ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి కృష్ణ మాట్లాడుతూ అష్టోత్తర 108 లింగాలకు రూ.2,116, సహస్ర 1008 లింగాలకు రూ.21,116 చెల్లించి కోటిలింగాల స్థాపన మహోత్సవంలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని భక్తులను కోరారు.

కోటిలింగాల స్థాపన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ఆలయ పునర్నిర్మాణం కోసం విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి గోనె శ్రీకాంత్ వ్యవహరించారు. కార్యక్రమంలో బన్నాల ప్రవీణ్, ఉప్పల్ ప్రెస్ క్లబ్ (ప్రింట్ & ఎలక్ట్రానిక్) అధ్యక్షులు వడ్డేపల్లి కిషోర్, ఆలయ కమిటీ ప్రతినిధులు బూరుగల రమేష్ గౌడ్, జెల్లీ మోహన్, అమృత లావు, గోనె అంజయ్య, దేవసాని బాలచందర్, చాతరాసి సిధిరాజు, పాల్వంచ విఠల్,

జయధీర్, కొంపల్లి రవీందర్, దేవుల పురుషోత్తం, ఆర్. బలరామ్, గూడ శ్రీశైలం, కావాలి నరసింహ, కొంగరి రామచంద్రర్, మాస శేఖర్, బోడ విద్యాసాగర్, శామీర్‌పేట చంద్రయ్య, గుర్రాల మల్లేష్, పల్లె నర్సంగ్ రావు, ఈరేల్లీ రవీందర్ రెడ్డి, సంఘీ స్వామి యాదవ్, ఓర్సు శేఖర్, సీకూరి కృష్ణ, అకిటి బాల్ రెడ్డి, అనసూయ రెడ్డి, వాసు, గజ్జల సత్యరాజ్, మడిపడేగ శ్రీనివాస్, రవీందర్ గౌడ్, జల్లీ ప్రశాంత్, శ్రీనివాస్, వంశీ, మార్వాడీ అసోసియేషన్ సభ్యులు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story