Hyderabad: హైదరాబాద్‌లో ‘నిసావ్ యూకే 2026’: గ్లోబల్ ట్రీ ఆధ్వర్యంలో ఈ నెల 11న యూకే విద్యా సదస్సు!

Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సుల్తాన్-ఉల్-ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఈ నెల 11న గ్లోబల్ ట్రీ ఆధ్వర్యంలో 'నిసావ్ యూకే 2026' విద్యా సదస్సు జరగనుంది.

RAJESH,	WEST ZONE
Published on: 9 Jun 2026 5:19 PM IST
Hyderabad: హైదరాబాద్‌లో ‘నిసావ్ యూకే 2026’: గ్లోబల్ ట్రీ ఆధ్వర్యంలో ఈ నెల 11న యూకే విద్యా సదస్సు!
X

హైదరాబాద్: 7 గ్లోబల్ ట్రీ సంస్థ ఆధ్వర్యంలో నగరంలో ఈ నెల 11వ తేదీన ప్రత్యేక సదస్సు జరగనుంది. బంజారాహిల్స్లోని సుల్తాన్-ఉల్-ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మ సీలో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 'నిసావ్ యూకే 2026' పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను సంస్థ వ్యవస్థాపకుడు ఆలపాటి శ్రీకర్ విడుదల చేశారు. సదస్సులో విద్యార్థులు, తల్లిదండ్రులు నేరుగా యూకే విద్యా నిపుణులతో మాట్లాడవచ్చు. అడ్మిషన్లు, స్కాలర్షిప్స్, పార్ట్-టైమ్ ఉద్యోగాలు, కెరీర్ గైడెన్స్డ్ పై పూర్తి సమాచారం లభిస్తుంది.

నిసావ్ యూకే వ్యవస్థాపకురాలు సనం అరోరా, బ్రిటిష్ డిప్యూటీ హైక మిషనర్ గారెత్ విన్ ఓవెన్, యూకే మాజీ ఎంపీ వీరేంద్రకుమార్ శర్మ విద్యార్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇంపీరియల్ కాలేజ్ లండన్, యూనివ ర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ వంటి 30కి పైగా ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఇం దులో పాల్గొంటున్నాయి. అర్హులైన విద్యార్థులకు రూ.2.5 లక్షల వరకు గ్లోబల్ ట్రీ స్కాలర్షిప్స్, రూ.8 లక్షల వరకు యూనివర్సిటీ స్కాలర్షిప్స్ వివరాలు అందుతాయి. ప్రతిభ ఆధారంగా అక్కడికక్కడే అడ్మిషన్ ఆఫర్ లెటర్లు ఇచ్చే అవకాశం కూడా ఉంది.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story