Vinukonda: వికలాంగులకు ఉచిత ట్రై సైకిళ్లు, వినికిడి పరికరాల పంపిణీ
Vinukonda: వినుకొండలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగులకు సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది.
Vinukonda: వికలాంగులకు ఉచిత ట్రై సైకిళ్లు, వినికిడి పరికరాల పంపిణీ
Vinukonda: వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగులకు సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని వికలాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్లు, వినికిడి లోపం ఉన్న వారికి వినికిడి పరికరాలు అందజేశారు.ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, వికలాంగులకు అండగా నిలిచి వారి జీవితాల్లో ఆనందాన్ని నింపడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శారీరక ఇబ్బందులు ఉన్నవారికి అవసరమైన సహాయం అందించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటూ అవసరమైన వారికి సహాయం అందిస్తోందని ప్రశంసించారు.




