Boyakonda: బోయకొండ గంగమ్మ క్షేత్రంలో భక్తుల సందడి
Boyakonda: అన్నమయ్య జిల్లా పుంగనూరు సమీపంలోని ప్రముఖ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.
Boyakonda: బోయకొండ గంగమ్మ క్షేత్రంలో భక్తుల సందడి
Boyakonda: శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రం తో పాటు కర్ణాటక తమిళనాడు తెలంగాణలో నుంచి విశేష సంఖ్యలో యాత్రికులు బోయకొండకు తరలివచ్చారు దీంతో కొండ మొత్తం భక్తజన సంద్రమైంది ఎన్నడూ లేని విధంగా అమ్మవారి క్యూ లైన్లు గాలిగోపురం దాటి మెట్ల వరకు వచ్చింది దాదాపు మూడు గంటల సమయం అమ్మవారి దర్శనానికి పట్టిందని భక్తులు అన్నారు యాత్రికుల వసతి కోసం ఈవో ఉపక కమిషనర్ ఏకాంబరం అనేక చర్యలు చేపట్టారు సొంతంగా తానే ఉంటూ క్యూ లైన్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పలు ఏర్పాట్లు చేశారు అయితే కొండ కింది నుంచి అమ్మవారి సన్నిధానం వరకు ఎక్కడపడితే అక్కడ కార్లు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య అధికమైంది ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు.




