Stock Market Today: ట్రంప్ ప్రకటన ఎఫెక్ట్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market Today: ఇరాన్ తో యుద్ధం త్వరలో ముగిసిపోతుందని ట్రంప్ చేసిన ప్రకటనతో స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలను నమోదు చేశాయి
Stock Market Today
Stock Market Today: స్టాక్ మార్కెట్ ఈరోజు (1 ఏప్రిల్ 2026) పుంజుకుంది. మొన్న అంటే 30 మార్చి, సోమవారం నష్టాలతో ముగిసిన ఇండెక్స్ లు లాభాల బాట పట్టాయి. ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభం నుంచే సానుకూలంగా ఇండిక్స్ లు కదిలాయి. ఉదయం 71,947 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ కొద్ది సేపట్లోనే 2000 పాయింట్లు జంప్ అయింది. ఆ తరువాత కాస్త, కిందకి దిగివచ్చిన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 1187 పాయింట్లు లాభపడి 73,134 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 348 పాయింట్లు లాభపడి 22,679 పాయింట్ల వద్ద ముగిసింది.
మార్కెట్ పెరుగుదలకు కారణాలు ఇవే..
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న సంకేతాలు: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం రాబోయే రెండు మూడు వారాల్లో ముగియవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా తన లక్ష్యాన్ని సాధించిందని, ఆపరేషన్ తుది దశలో ఉందని ఆయన తెలిపారు. దీంతో ఒక్కసారిగా మార్కెట్లు పుంజుకున్నాయి.
ప్రపంచ మార్కెట్ల నుండి వస్తున్న సానుకూల సంకేతాలు ట్రంప్ ట్రంప్ వ్యాఖ్యలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో దాదాపు అన్ని ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి
- దక్షిణ కొరియా కోస్పి సూచీ 8.44% పెరిగి 5,478 వద్ద ముగిసింది.
- జపాన్ నిక్కీ సూచీ 5.24% పెరిగి 53,739 వద్ద ముగిసింది.
- హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీ 2.04% పెరిగి 25,294 వద్ద ముగిసింది.
- చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 1.46% పెరిగి 3,948 వద్ద ముగిసింది.
మార్చి 31న లాభాల్లో ముగిసిన యూఎస్ మార్కెట్
- డౌ జోన్స్ 1,125 పాయింట్లు (2.49%) పెరిగి 46,341 వద్ద ముగిసింది.
- టెక్ ఆధారిత సూచీ అయిన నాస్‌డాక్ కాంపోజిట్ 3.83% పెరిగి 21,590 వద్ద ముగిసింది.
- ఎస్&పి 500 సూచీ 184 పాయింట్లు (2.91%) పెరిగి 6,528 వద్ద ముగిసింది.
ముడి చమురు 1% పెరిగి బ్యారెల్‌కు 105 డాలర్లకు చేరింది.
ముడి చమురు ధరలు ఈరోజు 1% పెరిగి బ్యారెల్‌కు 105 డాలర్లకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు సుమారు 70 డాలర్లుగా ఉండేవి.
మార్చి 30న మార్కెట్ పడిపోయింది
అంతకుముందు, మార్చి 30న, సెన్సెక్స్ 1,636 పాయింట్లు (2.22%) పడిపోయి 71,948 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 488 పాయింట్లు (2.14%) పడిపోయి 22,331 వద్ద ముగిసింది. మహావీర్ జయంతి సెలవుదినం కారణంగా నిన్న, మార్చి 31న స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ జరగలేదు.




