DMart: డీమార్ట్‌కు లాభాలు ఎలా వస్తాయో తెలుసా.. ఈ ట్రిక్ తెలిస్తే మీరూ కోటీశ్వరులే..

DMart: డీమార్ట్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది భారీ డిస్కౌంట్లు. ఇతర సూపర్ మార్కెట్ల కంటే తక్కువ ధరకు సరుకులు ఇస్తూనే.

Ravi
By Ravi
Published on: 9 Jun 2026 12:36 PM IST
DMart
X

DMart: డీమార్ట్‌కు లాభాలు ఎలా వస్తాయో తెలుసా.. ఈ ట్రిక్ తెలిస్తే మీరూ కోటీశ్వరులే..

DMart: సాధారణంగా ఏ వస్తువైనా బయట మార్కెట్ కంటే డీమార్ట్‌లో కాస్త తక్కువ ధరకే దొరుకుతుంది. అందుకే నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి మధ్యతరగతి ప్రజలు డీమార్ట్‌కు క్యూ కడుతుంటారు. అయితే అందరికంటే తక్కువ రేట్లకు ఇస్తూ, భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ కూడా డీమార్ట్ వేల కోట్ల లాభాలను ఎలా గడిస్తుంది.? అసలు డీమార్ట్ బిజినెస్ మోడల్ ఏంటి.? అని చాలామందికి సందేహం వస్తుంటుంది.

డీమార్ట్ సక్సెస్ సీక్రెట్స్ ఇవే:

అద్దె ఖర్చుల ఆదా:

ఇతర సూపర్ మార్కెట్లు అద్దె భవనాల్లో నడుస్తుంటే, డీమార్ట్ మాత్రం సాధారణంగా రెంట్‌కు భవనాలు తీసుకోదు. సొంతంగా స్థలం కొని బిల్డింగ్ కడతారు, లేదా 30 ఏళ్లకు పైగా సుదీర్ఘ కాలానికి స్థలాన్ని లీజుకు తీసుకుంటారు. దీనివల్ల డీమార్ట్‌కు ఏటా 3 శాతం నుంచి 8 శాతం వరకు అద్దె ఖర్చులు ఆదా అవుతున్నాయి.

సప్లయర్లకు వెంటనే చెల్లింపులు:

సాధారణంగా రిటైల్ మార్కెట్లో సప్లయర్లకు పేమెంట్ ఇవ్వడానికి నెలల సమయం పడుతుంది. కానీ డీమార్ట్ అలా కాదు. సరుకులు సరఫరా చేసిన కేవలం 7 నుంచి 11 రోజుల్లోనే వారికి డబ్బులు చెల్లిస్తుంది. ఇలా త్వరగా పేమెంట్ చేయడం వల్ల, సప్లయర్లు కూడా సంతోషంగా డీమార్ట్‌కు భారీ డిస్కౌంట్ రేట్లకు సరుకులు సప్లై చేస్తారు. ఆ డిస్కౌంట్‌నే డీమార్ట్ తన కస్టమర్లకు బదిలీ చేస్తుంది.

కేవలం నిత్యావసరాలే:

లగ్జరీ వస్తువులు లేదా త్వరగా అమ్ముడుపోని వస్తువులను డీమార్ట్ అసలు విక్రయించదు. కేవలం రోజువారీ నిత్యావసరాలనే ఎక్కువగా అమ్మడం వల్ల, పెట్టిన మూలధనం వృధా కాదు, స్టాక్ త్వరగా అమ్ముడుపోయి డబ్బు రొటేషన్ వేగంగా జరుగుతుంది.

తక్కువ నిర్వహణ ఖర్చులు:

ఇతర షాపింగ్ మాల్స్ మాదిరిగా డీమార్ట్‌లో ఫ్యాన్సీ ఇంటీరియర్స్, భారీ డెకరేషన్లు ఉండవు. అలాగే వీరు టీవీల్లో లేదా పేపర్లలో యాడ్స్ కోసం వందల కోట్లు ఖర్చు చేయరు. దీనివల్ల వారి నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి.

ఇలా ఒక పక్క అనవసరపు ఖర్చులను పూర్తిగా తగ్గించుకుంటూ, మరోపక్క సప్లయర్ల వద్ద డిస్కౌంట్లు పొందుతూ డీమార్ట్ ఇండియాలోనే నంబర్ వన్ రిటైల్ చెయిన్‌గా దూసుకుపోతోంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story