Gold Price Today : పసిడి ప్రేమికులకు కాస్త ఊరట.. నేడు పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే!

Gold Price Today : మే 24న దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడతో పాటు ప్రధాన నగరాల్లో నేటి పసిడి రేట్ల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

CR Reddy
Published on: 24 May 2026 7:14 AM IST
Gold Price Today
X

Gold Price Today 

Gold Price Today : బంగారం, వెండి కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలకు గత మూడు రోజులుగా కాస్త బ్రేక్ పడింది. వరుస తగ్గింపుల తర్వాత నేడు (మే 24, ఆదివారం) దేశీయ మార్కెట్‌లో పసిడి ధరలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ ఆధారంగా మన దేశంలో ప్రతిరోజూ ఉదయం రేట్లను సవరిస్తుంటారు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం ధరలు తగ్గడం, డాలర్ విలువ బలహీనపడితే బంగారం రేట్లు పెరగడం సహజం. నేడు దేశవ్యాప్తంగా వెండి ధర కూడా కేజీ రూ.2,85,000 వద్దే ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. శనివారంతో పోలిస్తే ఈరోజు రేట్లలో పెద్దగా హెచ్చుతగ్గులు లేకపోవడంతో కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

హైదరాబాద్, విజయవాడలో తులం బంగారం ఎంతంటే?

మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఈరోజు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఈ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,060 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,800 వద్ద ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది. ఇక మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,19,290 వద్ద స్థిరంగా ఉంది. నిన్నటి రేట్లతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఒక్క రూపాయి కూడా పెరగకపోవడం విశేషం.

దేశంలోని ఇతర మెట్రో నగరాల విషయానికి వస్తే ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,210 వద్ద విక్రయించబడుతుండగా, 22 క్యారెట్ల ధర రూ.1,45,950 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు బెంగళూరు, కోల్‌కతా మరియు కేరళ రాష్ట్రాల్లో కూడా ధరలు హైదరాబాద్ లాగే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,060 గాను, 22 క్యారెట్ల ధర రూ.1,45,800 గాను ఉంది. అయితే తమిళనాడు రాజధాని చెన్నైలో మాత్రం పసిడి రేట్లు ఎప్పుడూ కాస్త ఎక్కువగా ఉంటాయి. నేడు చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,690 వద్ద ట్రేడవుతుండగా, 22 క్యారెట్ల ధర రూ.1,47,300 వద్ద రికార్డు స్థాయిలోనే కొనసాగుతోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story