రూ. 50 లక్షల ఇల్లు లేదా ల్యాండ్ కొంటున్నారా.? అయితే ఇది తెలియకపోతే భారీ పెనాల్టీనే.!

Buying property: ల్యాండ్ లేదా ఇల్లు కొనేటప్పుడు కేవలం రిజిస్ట్రేషన్ ఖర్చులు చూసుకుంటే సరిపోదు. ఆస్తి విలువ రూ. 50 లక్షలు దాటితే..

Ravi
By Ravi
Published on: 9 Jun 2026 1:44 PM IST
Buying property
X

రూ. 50 లక్షల ఇల్లు లేదా ల్యాండ్ కొంటున్నారా.? అయితే ఇది తెలియకపోతే భారీ పెనాల్టీనే.!

Buying property: సొంత ఇల్లు లేదా ప్లాట్ కొనడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద మైలురాయి. అయితే, ఇలాంటి విలువైన ప్రాపర్టీలను కొనుగోలు చేసేటప్పుడు కేవలం డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ ఫీజులు చూసుకుంటే సరిపోదు. ఆదాయపన్ను శాఖ నిబంధనల ప్రకారం పక్కాగా ప్లాన్ చేసుకోకపోతే భవిష్యత్తులో అనవసరమైన లీగల్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత ఆదాయపన్ను చట్టం ప్రకారం, మీరు కొనుగోలు చేసే ఇల్లు, ఫ్లాట్ లేదా ల్యాండ్ వంటి స్థిరాస్తి విలువ రూ. 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే.. దానికి 'ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్' నిబంధనలు వర్తిస్తాయి.

1 శాతం టీడీఎస్ కట్ చేయాలి: ప్రాపర్టీ విలువ రూ. 50 లక్షలు దాటినప్పుడు, కొనుగోలుదారుడు.. విక్రేతకు ఇచ్చే మొత్తం పేమెంట్‌లో 1 శాతం టీడీఎస్ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని చెల్లించాలి. ఈ కట్ చేసిన 1 శాతం మొత్తాన్ని బయ్యరే స్వయంగా ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది.

పాన్ కార్డ్ లేకపోతే 20 శాతం పెనాల్టీ: ఇక్కడ కొనుగోలుదారులు జాగ్రత్తగా ఉండాలి. ఆస్తిని విక్రయించే వ్యక్తికి ఒకవేళ పాన్ కార్డ్ లేకపోతే, అప్పుడు కేవలం 1 శాతం మాత్రమే కాకుండా ఏకంగా 20 శాతం టీడీఎస్ డిడక్ట్ చేయాల్సి వస్తుంది. ఇది డీల్ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.

బయ్యర్లదే పూర్తి బాధ్యత: చాలామందికి ఈ నిబంధన తెలియక రిజిస్ట్రేషన్ తర్వాత ఐటీ శాఖ నుంచి నోటీసులు పొందుతుంటారు. ఆస్తి కొనుగోలు వ్యవహారాల్లో ఎలాంటి లీగల్, టాక్స్ సమస్యలు రాకుండా ముందే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన పూర్తి బాధ్యత బయ్యర్లదే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story