Bhadra Rajyog: వారం ఆగితే చాలు.. ఈ 4 రాశుల వారికి మంచి రోజులు రానున్నాయి

Bhadra Rajyog: జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. తెలివితేటలు, వ్యాపారం, కమ్యూనికేషన్, విద్య వంటి అంశాలకు బుధుడు కారకుడిగా భావిస్తారు.

Mokshith
Published on: 24 May 2026 3:19 PM IST
Bhadra Rajyog
X

Bhadra Rajyog: వారం ఆగితే చాలు.. ఈ 4 రాశుల వారికి మంచి రోజులు రానున్నాయి

Bhadra Rajyog: జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. తెలివితేటలు, వ్యాపారం, కమ్యూనికేషన్, విద్య వంటి అంశాలకు బుధుడు కారకుడిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో మే నెల చివరి వారంలో బుధుడు తన స్వరాశి అయిన మిథున రాశిలోకి ప్ర‌వేశించ‌డంతో భద్ర రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి క‌లిసిరానుంది.

భద్ర రాజయోగం అంటే ఏమిటి?

జ్యోతిష్య శాస్త్రంలో పంచ మహాపురుష యోగాలలో ఒకటిగా భద్ర రాజయోగాన్ని పరిగణిస్తారు. బుధుడు తన స్వరాశి లేదా ఉచ్చరాశిలో బలమైన స్థితిలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుందని చెబుతారు. ఈ యోగం వల్ల మేధస్సు, వ్యాపార నైపుణ్యం, నిర్ణయ సామర్థ్యం, ఆర్థిక అభివృద్ధి వంటి అంశాల్లో అనుకూల ప్రభావం కనిపిస్తుందని విశ్వసిస్తారు. భ‌ద్ర రాజ‌యోగం క‌లిసొచ్చే కొన్ని రాశులు ఇవే.

మేష రాశి: కొత్త అవకాశాలు, ఆర్థిక పురోగతి

భద్ర రాజయోగం ప్రభావంతో మేష రాశి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావచ్చు. ఉద్యోగ రంగంలో కొత్త బాధ్యతలు లేదా పదోన్నతికి సంబంధించిన సంకేతాలు కనిపించవచ్చు. విద్యార్థులకు పోటీ పరీక్షలు, విద్యా రంగంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల నుంచి మద్దతు లభించవచ్చు. అలాగే కుటుంబ ఆస్తులు లేదా వారసత్వానికి సంబంధించిన విషయాల్లో సానుకూల పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

కర్కాటక రాశి: ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం

కర్కాటక రాశి వారికి ఈ కాలం మానసికంగా, శారీరకంగా కొంత ఊరటను తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఇటీవల ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నవారికి పరిస్థితులు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలు అనుకూల ఫలితాలు ఇవ్వవచ్చు. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు బలపడతాయి. ఆర్థికంగా స్థిరత్వం పెరగడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకునే అవకాశం ఉంది.

మీన రాశి: కెరీర్‌లో కీలక మలుపు

మీన రాశి వారికి ఈ యోగం వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి అవకాశాలను తీసుకురావొచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషకులు సూచిస్తున్నారు. వ్యాపార రంగంలో ఉన్నవారు పెట్టుబడులు పెట్టే విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్లే పరిస్థితులు ఏర్పడవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా ఈ సమయంలో ఎక్కువగా లభించవచ్చు.

వృషభ రాశి: ఆర్థిక ఒత్తిడికి స్వ‌స్తి

వృషభ రాశి వారికి భద్ర రాజయోగం వల్ల ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైన మెరుగుదల కనిపించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అప్పుల భారం తగ్గడం లేదా పాత బకాయిలు తిరిగి అందడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు లభించవచ్చు. వ్యాపార రంగంలో కొత్త ఒప్పందాలు లేదా విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతం అయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రయాణాల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గమనిక:

ఈ వివ‌రాలు జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలు, పండితుల అభిప్రాయాల ఆధారంగా మాత్రమే అందించ‌డ‌మైంది. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని నిర్ధారించలేము. వ్యక్తిగత నమ్మకాలు, విశ్వాసాల మేరకు మాత్రమే ఈ సమాచారాన్ని పరిగణించాలి.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story