పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ సమీక్షలు – జూన్ 18, 19 తేదీల్లో అమరావతిలో కీలక సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజా రంగ సంస్థల కమిటీ (PUC) ఈ నెల 18, 19 తేదీల్లో అమరావతిలో కీలక సమీక్ష సమావేశాలు నిర్వహించనుంది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక స్థితి, సిబ్బంది, ఆడిట్ మరియు ప్రాజెక్టుల పురోగతిపై సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర సమగ్ర షెడ్యూల్ విడుదల చేశారు.
పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ సమీక్షలు – జూన్ 18, 19 తేదీల్లో అమరావతిలో కీలక సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజా రంగ సంస్థల కమిటీ (Committee on Public Undertakings) ఈ నెల 18, 19 తేదీల్లో అమరావతిలోని శాసనసభ కార్యాలయ కమిటీ హాల్-1లో సమీక్ష సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాలకు సంబంధించిన అధికారిక ప్రకటనను శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర విడుదల చేశారు.ఈ రెండు రోజుల సమావేశాల్లో ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు, ఆర్థిక స్థితి, పరిపాలనా విధానాలు, ప్రజా ప్రయోజనాల అమలు వంటి అంశాలపై కమిటీ విస్తృతంగా సమీక్ష చేపట్టనుంది.
విస్తృత అంశాలపై సమగ్ర పరిశీలన
కమిటీ సమావేశాల్లో సంస్థల స్థాపన లక్ష్యాలు ఎంతవరకు నెరవేరుతున్నాయో, ఆర్థిక పరిస్థితి, ఆస్తులు–అప్పుల వివరాలు, సంస్థల కార్యకలాపాలు వంటి అంశాలను లోతుగా పరిశీలించనున్నారు. అలాగే సిబ్బంది వివరాలు, ఖాళీలు, రోస్టర్ అమలు వంటి పరిపాలనా అంశాలపైనా సమీక్ష జరగనుంది.
అదే విధంగా ప్రభుత్వ విధానాల అమలు తీరు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పురోగతి, పీపీపీ విధానం, అవుట్‌సోర్సింగ్ వ్యవస్థ, ఖాతాల నిర్వహణ, ఆడిట్ అభ్యంతరాల పరిష్కారం, సంస్థల స్వయంప్రతిపత్తి, పనితీరు మెరుగుదల చర్యలు, సిఎస్‌ఆర్ నిధుల వినియోగం, ఈ-ఆఫీస్ అమలు వంటి అంశాలపై కూడా కమిటీ దృష్టి సారించనుంది.
*రెండు రోజుల ప్రత్యేక షెడ్యూల్*
జూన్ 18 గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో వ్యవసాయం, పట్టు పరిశ్రమ, సహకార రంగం, రైతు సంక్షేమం, పశుసంవర్థక, మత్స్య, వెటర్నరీ మరియు సామాజిక సంక్షేమ రంగాలకు చెందిన సంస్థల పనితీరు సమీక్షించబడుతుంది.
ఈ క్రమంలో ఏపీ స్టేట్ సీడ్స్ సర్టిఫికేషన్ ఏజెన్సీ, SERIFED, రైతు సాధికార సంస్థ, స్టేట్ అగ్రికల్చర్ మేనేజ్‌మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, ఏపీ స్టేట్ షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్, మీట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, APCARL, ఏపీ ఫిషర్‌మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్, ఏపీ వెటర్నరీ కౌన్సిల్, ఏపీ పారా వెటర్నరీ అండ్ అలైడ్ కౌన్సిల్ వంటి సంస్థల కార్యకలాపాలు, ఆర్థిక స్థితి మరియు లక్ష్యాల అమలుపై సమగ్ర సమీక్ష జరుగుతుంది.
జూన్ 19 శుక్రవారం రెండో రోజు సమావేశంలో సామాజిక, ఆర్థిక, మౌలిక సదుపాయాలు మరియు సంక్షేమ రంగాలకు చెందిన సంస్థల పనితీరు పరిశీలించనున్నారు.ఈ క్రమంలో ఏపీ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్, ఎంజేపీ ఏపీ బీసీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఏపీ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, SERP, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వంటి సంస్థల ఆర్థిక, పరిపాలనా పనితీరు మరియు ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు.




