Srikakulam: గురుకులంలో విషాదం మూడో అంతస్తు నుంచి పడి విద్యార్థిని మృతి
Srikakulam: శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది.
Srikakulam: గురుకులంలో విషాదం మూడో అంతస్తు నుంచి పడి విద్యార్థిని మృతి
Srikakulam: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఈ రోజు మధ్యాహ్నం మూడో అంతస్తు నుంచి కింద పడి చింతాడ పూజిత (12) అనే బాలిక మృతి చెందారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భోజనాలకు వెళుతుండగా మెట్లు పైనుంచి వస్తు జారి పడి కిందపడ్డారు.
మెడ పైన తీవ్ర గాయాలు కావడంతో పాఠశాల సిబ్బంది పాతపట్నం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. తలలోన అంతర్భాగంలో రక్తం శ్రావణం జరిగినట్లు తెలిపారు. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరి తీవ్రంగా రోదిస్తున్నారు.
తండ్రి సింహాద్రి కార్ డ్రైవర్ గా పని చేస్తూ కుమార్తెను పాఠశాలలో చదివిస్తున్నారు. తల్లి కొత్తమ్మతోపాటు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరి రోదిస్తున్నారు.




