Kukunuru: బైకులు ఢీ.. ఆసుపత్రిలో వైద్యులు లేక క్షతగాత్రుడి అవస్థలు

Kukunuru: ఏలూరు జిల్లా కుక్కునూరు మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 1 April 2026 7:16 PM IST
Kukunuru
X

Kukunuru: బైకులు ఢీ.. ఆసుపత్రిలో వైద్యులు లేక క్షతగాత్రుడి అవస్థలు

Kukunuru: ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటన బుధవారం కుక్కునూరులోని పెట్రోల్ బంక్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు.. ఏలూరు జిల్లా కుక్కునూరు మండల పరిధిలోని కివ్వాక గ్రామానికి చెందిన మడివి రాజులు ఎక్సెల్ మోపిడ్లో పెట్రోల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంకు వెళ్తుండగా,

కుక్కునూరు గ్రామానికి చెందిన వ్యక్తి స్పోట్స్ బైక్ పై పెట్రోల్ బంక్ వైపు నుండి నుండి ఇంటికి వస్తుండగా పెట్రోల్ బంకు సమీపంలోకి రాగానే రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. దీంతో రాజులు కాలు విరగడంతోపాటుగా తలకు తీవ్ర గాయాలయ్యాయి,

చెవిలోంచి రక్తం రావడం గమనించిన స్థానికులు క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో కుక్కునూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుక్కునూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులుు అందుబాటులో లేకపోవడంతో చికిత్స నిమిత్తం రాజుల్ని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story