Daggubati Purandeswari: రైతుల త్యాగం వృథా పోదు.. విభజన చీకటి రోజులను గుర్తుచేసిన పురందేశ్వరి!

Daggubati Purandeswari: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని బీజేపీ ఎంపీ పురందేశ్వరి స్పష్టం చేశారు. లోక్‌సభలో ఏపీ పునర్విభజన సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆమె, గత వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

Arun Chilukuri
Published on: 1 April 2026 3:59 PM IST
Daggubati Purandeswari
X

Daggubati Purandeswari: రైతుల త్యాగం వృథా పోదు.. విభజన చీకటి రోజులను గుర్తుచేసిన పురందేశ్వరి!

Daggubati Purandeswari: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, అమరావతి ప్రాముఖ్యతను వివరించారు.

"నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ అత్యంత అరాచకంగా జరిగింది. కనీసం చర్చ కూడా లేకుండా, పార్లమెంట్‌లో లైట్లు, కెమెరాలు ఆపేసి బిల్లును పాస్ చేశారు" అని పురందేశ్వరి ధ్వజమెత్తారు. చట్టాన్ని గౌరవించి ప్రజలు విభజనను అంగీకరించారని, ఆ తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ప్రస్థానం మొదలైందని ఆమె గుర్తు చేశారు.

రైతుల త్యాగం.. గత ప్రభుత్వ అరాచకం

రాజధాని కోసం అమరావతి రైతులు చేసిన త్యాగాలను ఆమె కొనియాడారు. రాజధాని నిర్మాణం కోసం 29 వేల మంది రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి భవితవ్యం అంధకారంలో పడిందని మండిపడ్డారు. భూములిచ్చిన రైతుల పట్ల గత ప్రభుత్వం అత్యంత అమానుషంగా ప్రవర్తించిందని, వారిని రోడ్డు పాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతికి శాశ్వత హోదా

విభజన ఆగ్రహం మరియు అవసరం నుంచి పుట్టిన అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక మరియు శాశ్వత రాజధానిగా ఉంటుందని పురందేశ్వరి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ బిల్లు ద్వారా అమరావతికి చట్టపరమైన రక్షణ లభిస్తుందని, రాష్ట్ర అభివృద్ధికి ఇది పునాది అని ఆమె పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story