Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డి సందడి ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ!

Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 33వ డివిజన్ వెంగళరావు నగర్‌లో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 April 2026 3:29 PM IST
Nellore
X

Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డి సందడి ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ!

Nellore: నేటి ఉదయం 33వ డివిజన్ వెంగళరావు నగర్ లో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం 4 వేలు పెన్షన్ అందిస్తున్న మంచి ప్రభుత్వం మాది అన్నారు రూరల్ ఎమ్మెల్యే.

పెన్షన్ల పంపిణీ విషయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉదారంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో ఎక్కడికక్కడ, వాడవాడల ఉద్యోగులతో కలిసి నాయకులు పండుగ వాతావరణంలో..పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ మన్నెం పెంచలనాయుడు, స్థానిక కార్పొరేటర్ కరణం మంజుల, 33 వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కరణం హజరత్ నాయుడు, బిజెపి నాయకులు మండ్ల ఈశ్వరయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ మస్తాన్, షఫీ, నాని, సరోజ, కర్నాటి పవన్, రంగయ్య, ఆనంద్, బాబు, చిట్టి, రమణయ్య, నాయుడు, విజయ్, మౌలాలి, సుబ్బరాయుడు, వెంకటేష్, బాలకృష్ణ,నాగేశ్వరరావు, దయాకర్, వాసు, మహ్లిం భాషా, రమేష్ రెడ్డి, మస్తానయ్య జనసేన పార్టీ నాయకులు లాల్ మస్తాన్, పాల్గొన్నారు

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story