Nara Lokesh: జ‌గ‌న్ ఎన్ని జ‌న్మలెత్తినా అమ‌రావ‌తిలో ఒక్క ఇటుక‌నూ కూడా తాక‌లేడు

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంపై మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 1 April 2026 4:16 PM IST
Nara Lokesh
X

Nara Lokesh: జ‌గ‌న్ ఎన్ని జ‌న్మలెత్తినా అమ‌రావ‌తిలో ఒక్క ఇటుక‌నూ కూడా తాక‌లేడు

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంపై మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు.

చారిత్రాత్మక విజయం

"నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ - నా రాజధాని అమరావతి అని ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చరిత్రాత్మక రోజుకు పార్లమెంటు వేదిక కావడం సంతోషంగా ఉంది" అని లోకేశ్ పేర్కొన్నారు.

ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని: అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా, అమరావతిని రాజధానిగా చేస్తూ గతంలో ఏపీ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానానికి ఇప్పుడు పార్లమెంటులో చట్టబద్ధత లభించడం గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు. ఇది అమరావతి రైతుల త్యాగాలకు లభించిన దైవ ఆశీస్సులని, వారి శాంతియుత పోరాట ఫలితమని లోకేశ్ కొనియాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, మద్దతు తెలిపిన ఇతర పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

వైసీపీ తీరుపై నిప్పులు

బిల్లు చర్చ సమయంలో వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడంపై మంత్రి లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. "అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చలో పాల్గొనకుండా వైకాపా సభ్యులు పారిపోవడం వారి ద్రోహబుద్ధికి నిదర్శనం" అని విమర్శించారు.

వైఎస్ జగన్ ఎన్ని జన్మలెత్తినా అమరావతిలో ఒక్క ఇటుకను కూడా తాకలేరని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరి తరము కాదని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల ఆకాంక్షల కోసం అమరావతి నిర్మాణం యుద్ధప్రతిపాదికన కొనసాగుతుందని లోకేశ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story