Tatipudi: ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సందడి స్వయంగా పింఛన్ల పంపిణీ!

Tatipudi: విజయనగరం జిల్లా గుర్ల మండలం తాటిపూడి గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 1 April 2026 6:01 PM IST
Tatipudi
X

Tatipudi: ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సందడి స్వయంగా పింఛన్ల పంపిణీ!

Tatipudi: గుర్ల మండలం తాటిపూడి గ్రామంలో ఈరోజు నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళా వెంకటరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్‌లను అందజేసి, వారి సమస్యలు, సంక్షేమ పథకాల అమలు పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, వికలాంగులు వంటి అర్హులైన ప్రతి ఒక్కరికీ సమయానికి పెన్షన్ అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు కొనసాగుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story