Nellore: వైసీపీ మూడు ముక్కలాటకు తెరపడింది మంత్రి నారాయణ హాట్ కామెంట్స్

Nellore: అమరావతి బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడంపై మంత్రి పొంగూరు నారాయణ హర్షం వ్యక్తం చేశారు.

V. Narasimhulu, Nellore
Published on: 1 April 2026 6:10 PM IST
Nellore
X

Nellore: వైసీపీ మూడు ముక్కలాటకు తెరపడింది మంత్రి నారాయణ హాట్ కామెంట్స్

Nellore: ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పై మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అడ్డుకునేందుకు వైసిపి చేసిన కుట్టలు పటాపంచలయ్యాయని, ఈరోజు రాష్ట్ర ప్రజలకు శుభవార్త. వైసీపీ మూడు ముక్కలాటకు తెరపడిందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయాన్నీ పక్కనపెట్టి రైతుల ప్లాట్లు గురించి మాట్లాడుతున్నారని చెప్పారు.

30,073 మంది రైతులు ఇచ్చిన భూమి 34,494 ఎకరాలు.. రైతులకు కేటాయించిన ప్లాట్లు 34925 ఎకరాలు, కేవలం ఇక 651 ఎకరాలు కేటాయింపులు జరగాలని చెప్పారు. రైతుల ప్లాట్లు 70,790 ప్లాట్లు. రిజిస్ట్రేషన్ అయింది 68870 ఎకరాలు.. ఇక కావాల్సింది 7912 మాత్రమే రిజిస్ట్రేషన్ జరగాలని చెప్పారు. అది కూడా రైతుల మధ్య కొన్ని వివాదాలు.. ఉన్నందున ఆగాయని చెప్పారు.

రేట్లు విషయం ఢిల్లీ తో పోల్చి చూసుకుని. జగన్మోహన్ రెడ్డి అవగాహన లేని లెక్కలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు..ఒక్క పైసా కూడా ప్రజల సొమ్మును ఉపయోగించం అని చెప్పాం. అలాగే చేస్తున్నాం. లోన్లు తీసుకొని డెవలప్ చేస్తున్నాం అని తెలిపారు మంత్రి నారాయణ. ప్రస్తుతం 5000 ఎకరాలు ఉన్నాయి. అది అమ్మితే మొత్తం మనం ఖర్చు పెట్టిన మొత్తం సమాకూరుతుందని. ఎకనైమిక్ గ్రోత్ ఉంటే సిటీ రాబడి వస్తుందని తెలిపారు.

రాజధాని కి ఆమోదం రావడం తో వైసీపీ కి భయం పట్టుకుందని చెప్పారు. 2028 ఆగష్టు కి రాజధాని పూర్తి అవుతుందని చెప్పారు. సర్వే రాళ్లు పై 750 కోట్లు తో జగన్ ఫొటోస్ వేసుకున్నారని, రాజధాని నగరానికి వచ్చే ఆదాయం నుంచి జిల్లాలకు ఖర్చు పెడతారని చెప్పారు మంత్రి నారాయణ.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story