Velerupadu: అగ్నిప్రమాద బాధితులకు సిపిఐ భరోసా
Velerupadu: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం చిగురుమామిడి గ్రామంలో అగ్నిప్రమాదానికి గురైన నాలుగు కుటుంబాలను సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పరామర్శించారు.
Velerupadu: అగ్నిప్రమాద బాధితులకు సిపిఐ భరోసా
Velerupadu: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని చిగురుమామిడి గ్రామంలో అగ్ని ప్రమాదం వలన నష్టపోయిన కుటుంబాలను బుధవారం సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో సిపిఐ నాయకుల బృందం పరామర్శించి ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు నగదు, 25 కేజీల బియ్యం అందించారు. ఊహించని అగ్ని ప్రమాదం వలన నాలుగు కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
పంటలు అమ్మడం వలన వచ్చిన నగదు, ఇంట్లో వస్తువులతో సహా కాలి బూడిదవడంతో బాధిత కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. అగ్నిమాపక కేంద్రం అందుబాటులో లేకపోవడం ప్రమాదానికి మరింత కారణమైందన్నారు. పూరిల్లు ఎక్కువగా ఉన్న ఈ మండలంలో అగ్నిమాపక కేంద్రం ఎంతో అవసరం అన్నారు. ఇంత ప్రమాదం సంభవించిన ప్రభుత్వం నుండి నేటికీ ఎటువంటి సహాయం అందకపోవటం సరైన విధానం కాదన్నారు.
వెంటనే ప్రభుత్వం స్పందించి ఆయా కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు కారం దారయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు పిట్టా ప్రసాద్, మండల కార్యదర్శి బాడిశ రాము, జిల్లా కౌన్సిల్ సభ్యులు పిట్టా వీరయ్య, కొప్పుల నాగరాజు, బేతి కిషోర్, తాటి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.




