Emmiganur: పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా

Emmiganur: ఎమ్మిగనూరు పట్టణం 25వ వార్డు ఎస్.ఎం.టీ కాలనీలో ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు.

Rama Mohan, Banaganapalle
Published on: 1 April 2026 6:40 PM IST
Emmiganur
X

Emmiganur: పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా

Emmiganur: ఎమ్మిగనూరు పట్టణంలోని 25వ వార్డు ఎస్.ఎం.టీ కాలనీలో నిర్వహించిన పేదల సేవలో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధాప్య, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు చెందిన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.

ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఈరోజు నుండి అమలు చేస్తున్న "చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం" ద్వారా వారికి కలిగే ప్రయోజనాల గురించి, చేనేత కుటుంబాలకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేద, బలహీన వర్గాల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యమన్నారు. అలాగే తాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్లు, విద్యుత్ స్తంభాలు మరియు వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

అదనంగా, మహిళల కోసం స్ట్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ పథకం, డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు తదితర సంక్షేమ మరియు ఉపాధి కార్యక్రమాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుర్ని కార్పొరేషన్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్, పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు, మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది, పట్టణ మరియు వార్డు కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Rama Mohan, Banaganapalle

Rama Mohan, Banaganapalle

Next Story