Parvathipuram: నాణ్యత లేని సీసీ రోడ్లు.. విచారణ జరపాలని సిపిఎం డిమాండ్

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో రూ. 120 కోట్ల ఉపాధి హామీ నిధులతో చేపట్టిన రోడ్డు పనుల్లో భారీ అక్రమాలు జరిగాయని సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు ఆరోపించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 April 2026 2:51 PM IST
Parvathipuram
X

Parvathipuram: నాణ్యత లేని సీసీ రోడ్లు.. విచారణ జరపాలని సిపిఎం డిమాండ్

Parvathipuram: ఉపాధిహామీ నిధులతో జరుగుతున్న సుమారు 120 కోట్ల రూపాయలు రోడ్లు పనులు ప్రభుత్వ నిబంధనల కు విరుద్ధంగా చేస్తున్నారని ప్రజాధనం దుర్వినియోగం అయిన పాలకులు పట్టించుకోవడంలేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం తిరుపతి రావు గారు పార్వతీపురం సుందరయ్య భవన్లో విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా కొన్ని గంగు నాయుడు గారు మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన ఉపాది హమీ నిధులు బీటీ రోడ్లకు సుమారు 70 కోట్లు, సీసీ రోడ్లకు సుమారు 50 కోట్లు మంజూరయ్యాయని ఈ పనుల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జిల్లా అధికారి యంత్రాంగం పనులు చేస్తున్నారని విమర్శించారు.

ఇన్ని కోట్ల రూపాయలు నిధులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ ద్వారా జరిపించాల్సి ఉన్నప్పటికీ జిల్లా అంతా నామినేషన్ ద్వారా కుటమి ప్రభుత్వం తన అనుయాయులుకు కట్టబెట్టిందని అన్నారు ఉదాహరణకి మక్కువ మండలం వెంకట భైరపురం నుండి తూరుమామిడి వరకు సుమారు మూడు కోట్ల 60 లక్షల రూపాయలు బీటీ రోడ్డుకు మంజూరు అయితే వాటిని ఏడు ముక్కలుగా విడగొట్టి నామినేషన్ పద్ధతి ద్వారా ఇచ్చారని ఎటువంటి అర్హత లేని కాంట్రాక్టర్లు పనులు చేయడం వల్ల ఈ రోడ్డు పనులు పూర్తిస్థాయిలో జరగలేదని అన్నారు ఇవే కాకుండా జి ఎం వలస మండలంలో టెండర్ ప్రక్రియ ద్వారా పనులు జరిపించాలని సమస్య ఎదురైనప్పుడు ఒక జిల్లాస్థాయి అధికారి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి కూటమి నాయకులను కూర్చోబెట్టి పరిష్కారం చేశారని,

ఈ విషయం పత్రికల్లో కూడా వచ్చిందని తెలిపారు కాబట్టి జిల్లా అధికార యంత్రాంగం పనులు కేటాయింపుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు అలాగే 120 కోట్లలో అధికార పార్టీ నాయకులు వారి అనుయాయులు ఉన్న గ్రామాలకు కోట్ల రూపాయల కేటాయించారనిఉదాహరణ కు సాలూరు మండలం, కూర్మరాజుపేటకు సుమారు కోటి రూపాయలు దాటి సీసీ రోడ్లు మంజూరు చేశారని, మక్కువ మండలం కాశీపట్నం కు సుమారు కోటి 30 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారని ఇలా పలు కేటాయింపుల్లో ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు కానీ గిరిజన గ్రామాలకు మాత్రం నామమాత్రం గానే సిసి రోడ్లు మంజూరు చేశారని ఇది అన్యాయమని సిపిఎం దీన్ని ఖండిస్తుందని అన్నారు.

సిపిఎం బృందం ఈరోజు ఉదయం కొమరాడ మండలం కంభవలస పంచాయతీలో కంచర పాడు గిరిజన గ్రామాన్ని పరిశీలన చేసినప్పుడు చాలా చిన్న రోడ్లు చిన్న కాలువలు వేశారని ఇదే ఉదాహరణ అని గంగునాయుడు అన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం తిరుపతి రావు గారు మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో సిసి రోడ్లు వెడల్పు తక్కువగా ఉన్నాయని, కాలువలు వెడల్పులు తక్కువగా ఉన్నాయని వర్షాలు వచ్చేటప్పుడు నీరు ప్రవహించడానికి ఆటంకం ఏర్పడుతుందని అలాగే సిసి రోడ్లు పరిశీలన చేసినప్పుడు నాణ్యత ప్రమాణాలు కూడా సరిగా పాటించడం లేదని అన్నారు.

అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన సిసి రోడ్లు పనులు రాత్రిపూట అధికారులు లేకుండానే కార్యకర్తలు ఇష్టానుసారంగా వేసుకున్నారని దీన్ని మక్కువ పంచాయితీరాజ్ ఏఈ ప్రజాశక్తి ముందు అంగీకరించారని రాత్రిపూట చేసిన రోడ్లు ఏ రకంగా నాణ్యంగా ఉంటాయని తిరుపతిరావు ప్రశ్నించారు అలాగే సిసి రోడ్డు వేసిన తర్వాత 15 రోజులు పాటు వాటరింగ్ చేయాలని అటువంటి పద్ధతి ఎక్కడ జరగలేదని,

కాబట్టి మొత్తం ఉపాధి నిధులతో జరిగిన రోడ్డు పనులన్నీ కూడా నాణ్యత ప్రమాణాలు పాటించడం పాటించలేదని అర్థమవుతుందని వెంటనే జిల్లా అధికార యంత్రాంగం ఉపాధి హామీ నిధులు మంజూరు, పనుల కేటాయింపు ప్రక్రియ, పనులు నాణ్యత పై సమగ్ర దర్యాప్తు చేసి క్వాలిటీ కంట్రోల్ అధికారులతో విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేకపోతే దీనిపై విజిలెన్స్ కు, రాష్ట్ర ఉపాధి కమీషనర్ కు ఫిర్యాదు చేస్తామని ప్రజలను కదిలించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story