Amaravati: అమరావతికి చట్టబద్ధత - ఏపీకి చారిత్రాత్మక మైలురాయి
Amaravati: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం లభించడంపై ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ హర్షం వ్యక్తం చేశారు.
Amaravati: అమరావతికి చట్టబద్ధత - ఏపీకి చారిత్రాత్మక మైలురాయి
Amaravati: అమరావతి బిల్లుకు ఆమోదం లభించడం ఏపీ కి చరిత్రాత్మక మైలురాయి అన్నారు ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్. ప్రధాని నరేంద్ర మోదీ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు దూరదృష్టి, నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. అమరావతి లక్ష్య సాధనలో నారా లోకేష్ పట్టుదల ప్రశంసనీయం అన్నారు.
అమరావతి అభివృద్ధి దిశగా కృషి చేసిన మంత్రి నారాయణ పాత్ర విశేషం అని చెప్పారు. ఈ సందర్భంగా షేక్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం లభించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కి అబ్దుల్ అజీజ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
అలాగే, రాష్ట్ర అభివృద్ధి మరియు అమరావతి లక్ష్య సాధనలో యువ నాయకుడిగా నారా లోకేష్ చూపుతున్న చొరవ, పట్టుదల ప్రశంసనీయం తెలిపారు. అమరావతి అభివృద్ధి దిశగా నిరంతరం కృషి చేసిన మంత్రి నారాయణ పాత్ర విశేషమని ప్రశంసించారు. రైతులతో సమన్వయం చేస్తూ రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చేసిన సేవలు అభినందనీయమని తెలిపారు. అమరావతి కోసం 1631 రోజులు దీర్ఘకాలంగా పోరాడిన రైతుల త్యాగాలు, వారి కన్నీళ్ళే ఈ విజయానికి మూల కారణమని అభినందించారు. ఈ చట్టబద్ధతతో రాష్ట్రానికి స్థిరత్వం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.




