Nandikotkur: అన్న క్యాంటీన్ల విస్తరణపై చర్చ.. మున్సిపల్ కమిషనర్లతో సీఈఓ సమీక్ష

Nandikotkur: అన్న క్యాంటీన్ల సలహా మండలి సమావేశంలో చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ పోతుల వంశీధర్ పాల్గొన్నారు.

Rama Mohan, Banaganapalle
Published on: 1 April 2026 7:31 PM IST
Nandikotkur
X

Nandikotkur: అన్న క్యాంటీన్ల విస్తరణపై చర్చ.. మున్సిపల్ కమిషనర్లతో సీఈఓ సమీక్ష

Nandikotkur: అన్న క్యాంటీన్లను మరింత మెరుగుపరిచి పేదలకు నాణ్యమైన ఆహారం అందించడంపై దృష్టి సారించాలని అన్న క్యాంటీన్ల చారిటబుల్ ట్రస్ట్ సిఈఓ పోతుల వంశీధర్ సూచించారు. స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో అన్న క్యాంటీన్ల స్థాయి సలహా మండలి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాలోని మున్సిపాలిటీల కమిషనర్లతో పాటు నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. కమిటీల ఏర్పాటు, అన్న క్యాంటీన్ల విస్తరణ, సేవల మెరుగుదలపై చర్చలు జరిపారు.

కమిషనర్ పి.విశ్వనాథ్ మాట్లాడుతూ.. పేదలకు మూడు పూటల భోజనం అందించే అన్న క్యాంటీన్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి మూడు పూటలకు రూ.75 వరకు ఖర్చు చేస్తూ, కేవలం రూ.15కే ఆహారం అందించడం గొప్ప కార్యక్రమమని తెలిపారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ రుచికరంగా వంటలు చేయడంతో పాటు పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలన్నారు. సమావేశంలో సలహా మండలి సభ్యులు పలు సూచనలు చేసి, సేవల మెరుగుదలకు సహకరించాలని అభిప్రాయపడ్డారు.

Rama Mohan, Banaganapalle

Rama Mohan, Banaganapalle

Next Story