Dharmavaram: ధర్మవరంలో మంత్రి అనుచరుల రౌడీయిజం

Dharmavaram: ధర్మవరం నియోజకవర్గంలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రౌడీయిజం చేయిస్తున్నారని టిడిపి నేత, న్యాయవాది అంజన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 24 May 2026 2:16 PM IST
Dharmavaram
X

Dharmavaram: ధర్మవరంలో మంత్రి అనుచరుల రౌడీయిజం

ధర్మవరం: నియోజకవర్గంలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రౌడీయిజం చేయిస్తున్నారని న్యాయవాది అంజన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అనంతపురంలోని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రి అనుచరుల అరాచకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ నెల 19వ తేదీన ధర్మవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన తనపై, మంత్రి సత్యకుమార్ యాదవ్ అనుచరులు పథకం ప్రకారమే ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని అంజన్ రెడ్డి ఆరోపించారు.మంత్రి అనుచరుల నుంచి ప్రస్తుతం తనకు ప్రాణహాని ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గత ఎన్నికల్లో సత్యకుమార్ యాదవ్‌కు అనుకూలంగా పనిచేయలేదనే కక్షతోనే, అలాగే మంత్రి పనితీరుపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకే ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.నాపైనే దాడి చేసి, తిరిగి నేనే కులం పేరుతో దూషించానంటూ నాపై అక్రమ కేసులు పెట్టారు.

నేను ఎవరినైనా దూషించానో లేదో అక్కడి సిసి (CC) కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే నిజాలు బయటపడతాయి.ధర్మవరం నియోజకవర్గ ప్రజలు మంత్రి సత్యకుమార్ యాదవ్ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రశ్నించే వారిపై దాడులు చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story