Amaravati: రాజ్యసభ పిటిషన్స్ కమిటీ సభ్యునిగా ఎంపీ బీద మస్తాన్ నియామకం!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్‌కు పార్లమెంట్‌లో కీలక పదవి దక్కింది.
Amaravati: రాజ్యసభ పిటిషన్స్ కమిటీ సభ్యునిగా ఎంపీ బీద మస్తాన్ నియామకం!
Amaravati: రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ ని రాజ్యసభ పిటిషన్స్ కమిటీ సభ్యునిగా నియమిస్తూ.. రాజ్యసభ ఛైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు. 2026 మే 20వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే విధంగా కమిటీని పునర్వ్యవస్థీకరించినట్లు పార్లమెంటరీ బులెటిన్‌లో వెల్లడించారు. ఈ కమిటీకి శ్రీ రాఘవ్ చద్దా ఛైర్మన్‌గా నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చే వినతులు, ప్రజా సమస్యలు, పాలనాపరమైన అంశాలపై పరిశీలన చేసి సంబంధిత శాఖలకు సూచనలు చేసే కీలక బాధ్యతలను ఈ కమిటీ నిర్వహిస్తుంది.
ఈ సందర్భంగా బీద మస్తాన్ రావు యాదవ్ మాట్లాడుతూ..
తనను రాజ్యసభ పిటిషన్స్ కమిటీ సభ్యునిగా నియమించినందుకు భారత ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ ఛైర్మన్ గౌరవనీయులు రాధాకృష్ణన్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, తనపై నమ్మకం ఉంచి ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ మార్గనిర్దేశనం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రజల సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని బీద మస్తాన్ రావు యాదవ్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం మరియు వెనుకబడిన వర్గాల సమస్యల పరిష్కారానికి కమిటీ వేదికగా తన వంతు కృషి కొనసాగిస్తానని తెలిపారు.




